ETV Bharat / sports

IPL 2023: RCB తరఫున మళ్లీ బరిలోకి డివిలియర్స్.. ఫ్యాన్స్​కు ఫుల్​ మజా!

author img

By

Published : Nov 9, 2022, 8:40 PM IST

ipl 2023 devilliers will play first match at chinnaswamy stadium bengaluru
ipl 2023 devilliers will play first match at chinnaswamy stadium bengaluru

IPL 2023: ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరోసారి చిన్నస్వామి స్టేడియంలో బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2023లో ఆర్సీబీ బెంగళూరులో ఆడబోయే తొలి మ్యాచ్‌లో తాను ఆడనున్నట్టు డివిలియర్స్ ప్రకటించాడు.

IPL 2023 RCB Devilliers: ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2023లో ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ తరఫున మరోసారి బరిలోకి దిగబోతున్నాడు. అతడితోపాటు క్రిస్ గేల్ కూడా ఆర్సీబీ తరఫున ఆడనున్నాడు. గతేడాది క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డివిలియర్స్.. ఐపీఎల్‌లోనూ ఆడలేదు. కానీ రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఏదో ఒక రూపంలో సేవలు అందిస్తానని చెబుతున్న ఏబీడీ.. తాజాగా ఆర్సీబీ తరఫున చివరిసారిగా ఆడనున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్ 2023లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆడే తొలి మ్యాచ్‌లో తాను మైదానంలోకి బరిలో దిగుతానని.. తనతోపాటు క్రిస్ గేల్ సైతం ఆడతాడని డివిలియర్స్ చెప్పాడు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఏబీడీ.. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాలను వెల్లడించాడు.

ఆర్సీబీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న డివిలియర్స్.. భవిష్యత్తులో ఏదో ఒక రూపంలో తాను ఫ్రాంచైజీకి సేవలు అందిస్తానని చెప్పాడు. తాను అధికారికంగా ఫ్యాన్స్ ముందు రిటైర్మెంట్ ప్రకటించడం కుదరలేదని.. చిన్నస్వామి స్టేడియంలో మరోసారి బరిలోకి దిగనుండటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఏబీడీ తెలిపాడు. మార్చి 2023లో స్పెషల్ మెమొరీని అభిమానులతో పంచుకోనున్నట్లు తెలిపాడు. కోహ్లీ, డివిలియర్స్ కలిసి ఆడటాన్ని చూసి ఎంజాయ్ చేయాలని భావించే ఆర్సీబీ ఫ్యాన్స్ ఇది నిజంగానే గుడ్ న్యూస్ కానుంది. డివిలియర్స్ ఫేర్‌వెల్ మ్యాచ్‌ కోసం చిన్నస్వామి స్టేడియం.. ఆర్సీబీ, ఏబీడీ నినాదాలతో మార్మోగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.