ETV Bharat / sports

IPL 2023 సూపర్​ అప్డేట్​.. మినీ వేలానికి డేట్​ ఫిక్స్​.. ఎప్పుడంటే?

author img

By

Published : Nov 9, 2022, 5:13 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ తుది దశకు చేరుతున్న వేళ.. ఐపీఎల్​ 2023 వేలానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్​ వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2023కు సంబంధించిన వేలం పాట వేదికను, తేదీని ఖరారు చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆ వివరాలు..

IPL 2023 Auction Date
IPL 2023 Auction Date

IPL 2023 Auction Date: క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్​ 2023కు సంబంధించి సూపర్​ అప్డేట్​ వచ్చింది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎస్​ సీజన్ కోసం బీసీసీఐ.. వేలం పాట వేదికను, తేదీని ఫిక్స్​ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇది వరకు వార్తలొచ్చినట్లుగా ఐపీఎల్​ 2023 సీజన్​కు సంబంధించిన మినీ వేలంపాటను నిర్వహించడానికి తుర్కియే రాజధాని ఇస్తాంబుల్​కు వెళ్లట్లేదు బీసీసీఐ. స్వదేశంలోనే దీన్ని నిర్వహించనుంది. గతేడాది సిలికాన్​ సిటీ బెంగళూరులో వేలం నిర్వహించిన బీసీసీఐ.. ఈ సారి ఆక్షన్​కు కేరళలోని కొచ్చి నగరాన్ని వేదికగా ఖరారు చేసిందట. డిసెంబర్ 23వ తేదీన వేలంపాటను నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న పది ఫ్రాంఛైజీల వద్ద 90 నుంచి 95 కోట్ల రూపాయల బ్యాలెన్స్ మిగిలివుంది. ఈ మొత్తంలో కొత్త ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఫ్రాంఛైజీలవారీగా చూసుకుంటే పంజాబ్ కింగ్స్- రూ.3.45 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్- రూ.2.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ.1.55 కోట్లు, రాజస్థాన్ రాయల్స్- రూ.95 లక్షలు, గుజరాత్ టైటాన్స్- రూ. 15 లక్షలు, ముంబయి ఇండియన్స్- రూ.10 లక్షలు, సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ.10 లక్షలు, దిల్లీ కేపిటల్స్ - రూ.10 లక్షల రూపాయల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఒక్క లఖ్​నవూ సూపర్ జెయింట్స్ పర్స్‌లో మాత్రమే జీరో బ్యాలెన్స్ ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.