ETV Bharat / sports

IPL 2022: ముంబయి మళ్లీ అదే కథ.. వరుసగా పదో సీజన్​లోనూ..

author img

By

Published : Mar 28, 2022, 12:47 PM IST

IPL 2022
Mumbai Indians

IPL 2022 Mumbai Indians: ముంబయి ఇండియన్స్​ జట్టు ఓ అనవసర రికార్డును ఖాతాలో వేసుకుంది. 2013 ఐపీఎల్​ నుంచి ఇప్పటివరకూ ఒక్క ఆరంభ మ్యాచ్​లో కూడా గెలవలేదు. దీంతో వరుసగా పది సీజన్లలో తొలి మ్యాచ్​ ఓడిపోయిన జట్టుగా రికార్డును మూటగట్టుకుంది.

IPL 2022 Mumbai Indians: ఐపీఎల్​ 2022 మెగా టీ20 టోర్నీలో ఆదివారం దిల్లీతో తలపడిన తొలి మ్యాచ్‌లో ముంబయి ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 177 పరుగుల భారీ స్కోర్‌ సాధించినా ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయింది. దిల్లీ 18.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ముంబయి 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ ఓటమితో ముంబయి ఓ అనవసరపు రికార్డును సొంతం చేసుకుంది. వరుసగా పదో సీజన్‌లో ఇలా తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైన జట్టుగా నిలిచింది.

2009 నుంచి 2012 వరకు వరుసగా నాలుగేళ్లు తొలి మ్యాచ్‌లు గెలుపొందిన ఆ జట్టు తర్వాత.. 2013 నుంచి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా లీగ్‌ స్టేజ్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచింది లేదు. అయితే, ఈ మధ్యకాలంలోనే ఎవరికీ వీలుకాని విధంగా ముంబయి ఐదుసార్లు ఛాంపియన్‌గా అవతరించింది. దీన్ని బట్టి ముంబయి టైటిల్‌ సాధించాలంటే తొలి మ్యాచ్‌ ఫలితంతో దానికి సంబంధమే లేదని అర్థమవుతోంది.

ముంబయి వరుస ఓటములు ఇలా..

  • 2013లో బెంగళూరు చేతిలో 2 పరుగుల తేడాతో ఓటమి.
  • 2014లో కోల్‌కతా చేతిలో 41 పరుగుల తేడాతో ఓటమి.
  • 2015లో కోల్‌కతాతోనే 7 వికెట్ల తేడాతో విఫలం.
  • 2016లో పుణె చేతిలో 9 వికెట్ల తేడాతో వైఫల్యం.
  • 2017లోనూ అదే జట్టుతో 7 వికెట్ల తేడాతో ఓటమి.
  • 2018లో చెన్నై చేతిలో 1 వికెట్‌ తేడాతో వైఫల్యం.
  • 2019లో దిల్లీతో 37 పరుగుల తేడాతో ఓటమి.
  • 2020లో చెన్నై చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి.
  • 2021లో బెంగళూరు చేతిలో 2 వికెట్ల తేడాతో విఫలం.
  • 2022లో దిల్లీ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి.

ఇదీ చదవండి: ముంబయికి షాక్​.. రోహిత్‌ శర్మకు భారీ జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.