ETV Bharat / sports

ఆర్సీబీపై సన్​రైజర్స్​ హైదరాబాదే పైచేయి

author img

By

Published : Nov 6, 2020, 7:01 PM IST

Updated : Nov 6, 2020, 11:25 PM IST

RCB won the toss and elected to bowl first
టాస్ గెలిచిన సన్​రైజర్స్.. ఆర్సీబీ బ్యాటింగ్

23:22 November 06

క్వాలిఫైయర్స్​-2లో వార్నర్​సేన

ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ అదరగొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరును ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. డివిలియర్స్‌ (56) అర్ధశతకం బాదాడు. ఆ జట్టును హోల్డర్ (3/25), నటరాజన్‌ (2/33) దెబ్బతీశారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్‌ 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విలియమ్సన్‌ (50*) అర్ధశతకంతో సత్తాచాటాడు. క్వాలిఫయిర్‌-2లో ఆదివారం దిల్లీతో హైదరాబాద్‌ తలపడనుంది.

22:44 November 06

ఆచితూచి ఆడుతున్న సన్​రైజర్స్

లక్ష్య ఛేదనలో నిలకడగా ఆడుతోంది సన్​రైజర్స్. విలియమ్సన్ (37), హోల్డర్ (9) ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 17 ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది హైదరాబాద్. గెలుపు కోసం ఇంకా 18 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉంది. 

22:17 November 06

నిలకడగా సన్​రైజర్స్​ బ్యాటింగ్​

సన్​రైజర్స్​ హైదరాబాద్​ బ్యాట్స్​మెన్​ ప్రస్తుతం ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. 10 ఓవర్ల పూర్తయ్యే సమయానికి 3 వికెట్లు కోల్పోయిన వార్నర్​సేన 60 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో కేన్​ విలియమ్సన్​ (6), ప్రియమ్​ గార్గ్​ (4) ఉన్నారు. 

21:47 November 06

స్పీడ్ పెంచిన సన్​రైజర్స్

లక్ష్య ఛేదనలో కాస్త స్పీడ్ పెంచింది సన్​రైజర్స్. ప్రస్తుతం 5 ఓవర్లకు వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. వార్నర్ (9) నిదానంగా ఆడుతుంటే, మనీశ్ పాండే (22) దూకుడుగా ఆడుతున్నాడు.

21:31 November 06

నెమ్మదిగా ఆడుతోన్న సన్​రైజర్స్ 

నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది సన్​రైజర్స్. మొదటి ఓవర్లోనే శ్రీవాత్సవ్ గోస్వామి (0) సిరాజ్ బౌలింగ్​లో డకౌటయ్యాడు. ప్రస్తుతం రెండు ఓవర్లకు వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది సన్​రైజర్స్.

21:06 November 06

సన్​రైజర్స్ లక్ష్యం 132

సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరుగుతోన్న మ్యాచ్​లో బెంగళూరు బ్యాట్స్​మన్ తడబడ్డారు. సన్​రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​తో ఆకట్టుకున్నారు.  ఫలితంగా నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కోహ్లీ (6), పడిక్కల్ (1), మొయిన్ అలీ (0), దూబే (8) పూర్తిగా విఫలమయ్యారు. ఫించ్ 32 పరుగులతో పర్వాలేదనిపించగా.. డివిలియర్స్ (56) మరోసారి జట్టును తన అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. దీంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. సన్​రైజర్స్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లతో రాణించగా, నటరాజన్ 2, నదీమ్ 1 వికెట్ దక్కించుకున్నారు.

20:58 November 06

తడబడుతోన్న బెంగళూరు

మరో రెండు వికెట్లు కోల్పోయింది బెంగళూరు. హాఫ్ సెంచరీ చేసిన డివిలియర్స్ (52)ను నటరాజన్ అద్భుత యార్కర్​తో బోల్తా కొట్టించాడు. సుందర్ కూడా 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.  ప్రస్తుతం ఆర్సీబీ 18 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.

20:46 November 06

100 దాటిన ఆర్సీబీ స్కోర్

గౌరవప్రదమైన స్కోర్ దిశగా పయనిస్తోంది బెంగళూరు. ప్రస్తుతం 16 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు సాధించింది. దూబే 8 పరుగులు చేసి ఔటయ్యాడు. 

డివిలియర్స్ హాఫ్ సెంచరీ

మిగతా బ్యాట్స్​మన్ తడబడుతున్నా సీనియర్ బ్యాట్స్​మన్  డివిలియర్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

20:26 November 06

ఒకే ఓవర్​లో రెండు వికెట్లు

సన్​రైజర్స్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. 11వ ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. నదీమ్ వేసిన బంతిని గాల్లోకి లేపిన ఫించ్ (32) క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు. అదే ఓవర్ నాలుగో బంతి నో బాల్ వేయగా.. పరుగుకు ప్రయత్నించిన మొయిన్ అలీ రనౌట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 11 ఓవర్లు పూర్తయ్యే సరికి 65 పరుగులు చేసింది ఆర్సీబీ.

20:12 November 06

కట్టుదిట్టంగా సన్​రైజర్స్ బౌలింగ్

సన్​రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 9 ఓవర్లు పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది ఆర్సీబీ. ఫించ్ (25), డివిలియర్స్ (12) క్రీజులో ఉన్నారు.

19:50 November 06

పడిక్కల్ ఔట్

మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ కూడా ఔటయ్యాడు. హోల్డర్ వేసిన నాలుగో ఓవర్లో ప్రియమ్ గార్గ్​కు క్యాచ్ ఇచ్చి పెవిలియర్ చేరాడు. ప్రస్తుతం నాలుగు ఓవర్లకు 15 పరుగులు చేసింది ఆర్సీబీ.

19:39 November 06

కోహ్లీ ఔట్

రెండో ఓవర్ రెండో బంతికే బెంగళూరు సారథి కోహ్లీ (6) ఔటయ్యాడు. హోల్డర్ వేసిన బంతిని ఆడబోయి కీపర్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం రెండు ఓవర్లకు వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది ఆర్సీబీ.

19:33 November 06

నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్సీబీ

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించింది. పడిక్కల్​తో కలిసి ఈ మ్యాచ్​లో ఓపెనర్​గా బరిలో దిగాడు కోహ్లీ. వీరిద్దరూ కలిసి మొదటి ఓవర్లో 5 పరుగులు చేశారు.

19:07 November 06

జట్లు

సన్​రైజర్స్ హైదరాబాద్

వార్నర్ (కెప్టెన్), శ్రీవాత్సవ్ గోస్వామి, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షహబాద్ నదీమ్, సందీప్ శర్మ, నటరాజన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఫించ్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, మొయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, నవదీప్ సైనీ, ఆడం జంపా, సిరాజ్, చాహల్

18:20 November 06

బెంగళూరు బ్యాటింగ్

వరుస ఓటములతో సతమతవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హ్యాట్రిక్​ విజయాలతో దూకుడు మీదున్న సన్​రైజర్స్ హైదరాబాద్.. నేడు జరిగే ఎలిమినేటర్​ మ్యాచులో​ తలపడనున్నాయి. ఇందులో గెలిచి ముందడగు వేయాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఈ మ్యాచ్​లో మొదట గెలిచిన సన్​రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.

Last Updated :Nov 6, 2020, 11:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.