ETV Bharat / sports

ప్లేఆఫ్స్​ కోసం పంజాబ్​.. పరువు నిలుపుకోవాలని చెన్నై

author img

By

Published : Nov 1, 2020, 5:24 AM IST

అబుదాబి వేదికగా పంజాబ్- చెన్నై జట్ల మధ్య నేడు (ఆదివారం) మ్యాచ్​ జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలు కానుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​లో పంజాబ్​ ఏం చేస్తుందో చూడాలి.

IPL PREVIEW KXIP VS CSK: Do-or-die game for KXIP, CSK play for pride
ప్లేఆఫ్స్​ కోసం పంజాబ్​.. పరువు నిలుపుకోవాలని చెన్నై

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సిద్ధమైంది. చెన్నై సూపర్​కింగ్స్​తో నేడు (ఆదివారం) జరిగే పోరులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన చెన్నై, ఈ పోరులో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.

ఈ మ్యాచ్​లో గెలిస్తే పంజాబ్​ నాలుగో స్థానానికి చేరుకోవచ్చు. అదే సమయంలో హైదరాబాద్​.. తన రెండు మ్యాచ్​ల్లో ఏదో ఓ దానిలో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మిగిలిన లీగ్​ మ్యాచ్​ల ఫలితాలపై పంజాబ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

పంజాబ్​కు అవకాశాలు ఎక్కువే!

ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్.. చెన్నైతో ఆఖరి లీగ్​ మ్యాచ్​ ఆడనుంది. గేల్​ రాకతో వరుసగా ఆరు మ్యాచ్​ల్లో ఐదు గెలిచి, రాజస్థాన్​తో జరిగిన గత మ్యాచ్​లో ఓడింది. మళ్లీ ఫామ్​లోకి వచ్చి, టాప్-4లో నిలవాలని చూస్తోంది.

kxip team
కింగ్స్ ఎలెవన్ పంజాబ్

బ్యాటింగ్​లో కేఎల్ రాహుల్, గేల్, పూరన్ అదరగొడుతున్నారు. బౌలింగ్​ విభాగం నుంచి వీరికి పూర్తి సహకారం అందాల్సి ఉంది. ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను నిలువరించగలిగితే పంజాబ్​కు గెలవడం పెద్ద కష్టమేమీ కాదు!

పరువు కోసం చూస్తున్న చెన్నై​

ఇప్పటికే ప్లేఆఫ్స్​ నుంచి నిష్క్రమించిన చెన్నై.. గత రెండు మ్యాచ్​ల్లో గెలిచింది. యువ బ్యాట్స్​మన్ రుతురాజ్ గైక్వాడ్.. వరుసగా అర్ధశతకాలు చేసి ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడిదే ఊపును పంజాబ్​పై కొనసాగించాలని చూస్తున్నాడు. జడేజా కూడా ఫినిషర్​గా అదరగొడుతున్నాడు. బౌలర్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. మరి పంజాబ్​పై ఏం చేస్తారో చూడాలి.

CSK TEAM
చెన్నై సూపర్​కింగ్స్ బ్యాట్స్​మెన్

జట్లు(అంచనా)

చెన్నై: సామ్ కరన్, డుప్లెసిస్, రాయుడు, జగదీషన్, ధోనీ (కెప్టెన్), రుతురాజ్, జడేజా, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, హెజిల్​వుడ్, తాహిర్

పంజాబ్: కేఎల్ రాహుల్(సారథి), మయాంక్ అగర్వాల్, గేల్, పూరన్, మాక్స్​వెల్,​ దీపక్ హుడా, నీషమ్, మురుగన్ అశ్విన్, షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్​ సింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.