ETV Bharat / sports

కోట్ల రూపాయల ఆటగాళ్లు.. సిక్సులు కొట్టలేకపోతున్నారు!

author img

By

Published : Oct 23, 2020, 12:40 PM IST

Ben Stokes yet to hit a six after playing 103 balls
స్టోక్స్

ఐపీఎల్​ వేలంలో కోట్ల రూపాయలు పలికిన స్టోక్స్, మ్యాక్స్​వెల్.. ఈ సీజన్​లో సిక్సులు కొట్టడంలో చేతులెత్తేస్తున్నారు. వారు ధనాధన్ బ్యాటింగ్ ఆడేది ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్.. వరుస మ్యాచ్​ల్లో విఫలమవుతూ అభిమానుల్ని నిరాశపరుస్తున్నాడు. ఈ సీజన్​లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్​లాడి 103 బంతులు ఎదుర్కొని, కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా 14 ఫోర్లు బాదాడు కానీ ఒక్కటంటే ఒక్క సిక్సర్ కొట్టలేకపోయాడు. బౌలింగ్​ కూడా ఆరు ఓవర్లే వేశాడు. దీంతో అతడిని ఫ్రాంచైజీ సరిగా వినియోగించుకోవట్లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018లో స్టోక్స్​ను రూ.12.5 కోట్లు పెట్టి రాజస్థాన్ జట్టు సొంతం చేసుకుంది.

ఇదే సీజన్​లో పంజాబ్​ జట్టు ఆల్​రౌండర్ మ్యాక్స్​వెల్ కూడా తన బ్యాటింగ్​తో నిరాశపరుస్తున్నాడు. ఇప్పటివరకు 87 బంతులు ఎదుర్కొని 90 పరుగులు మాత్రమే చేశాడు. 8 ఫోర్లే కొట్టి సిక్సర్లు కొట్టలేకపోతున్నాడు.

maxwell
పంజాబ్ క్రికెటర్ మ్యాక్స్​వెల్

ఇది చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.