ETV Bharat / sports

ఒకే జట్టు ఆటగాళ్ల దగ్గర ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్

author img

By

Published : Oct 2, 2020, 5:13 PM IST

IPL 13: Mayank Agarwal claims Orange caps, Purple Cap with Mohammad Shami
మయాంక్​కు ఆరెంజ్​ క్యాప్.. షమికి పర్పుల్​ క్యాప్​

ఐపీఎల్​లో అత్యధిక పరుగులు, వికెట్లు సాధించిన ఆటగాళ్లకు ఆరెంజ్​, పర్పుల్​ క్యాప్​లను టోర్నీ నిర్వాహకులు అందజేస్తారు. ప్రస్తుతం ఆరెంజ్​ క్యాప్​ మయాంక్​ అగర్వాల్​.. పర్పుల్​ క్యాప్​ మహ్మద్​ షమీ దగ్గర ఉన్నాయి. ఈ రెండు క్యాప్​లూ ఒకే జట్టుకు చెందిన ఆటగాళ్ల దగ్గర ఉండటం విశేషం.

ఐపీఎల్​లో అత్యధిక రన్స్​ చేసిన బ్యాట్స్​మన్​కు ఆరెంజ్​ క్యాప్​ను, అత్యధిక వికెట్స్​ సాధించిన బౌలర్​కు పర్పుల్​ క్యాప్​ను ప్రదానం చేయడం ఆనవాయితీ. టోర్నీ ప్రారంభంలో ఆరెంజ్​ క్యాప్​ను కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ సాధించగా.. ప్రస్తుతం అదే జట్టులోని ఓపెనర్​ మయాంక్​ అగర్వాల్​ ఆ టోపీని సొంతం చేసుకున్నాడు. పర్పుల్​ క్యాప్​ కూడా ఇదే జట్టుకు చెందిన షమీ దగ్గర ఉండటం విశేషం.

ఒకే జట్టు బ్యాట్స్​మెన్​ పోటీ

ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్ ఓపెనర్​ మయాంక్​ అగర్వాల్​ 18 బంతుల్లో 25 పరుగులు రాబట్టాడు. దీంతో టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 246 రన్స్​తో మయాంక్​ అగ్రస్థానానికి చేరుకుని ఆరెంజ్​ క్యాప్​ దక్కించుకున్నాడు. 239 పరుగులతో రెండో స్థానంలో కేఎల్​ రాహుల్​ ఉన్నాడు. మూడో స్థానంలో చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మన్​ డుప్లెసిస్​ (మూడు మ్యాచ్​ల్లో 173 పరుగులు) నిలిచాడు.

IPL 13: Mayank Agarwal claims Orange caps, Purple Cap with Mohammad Shami
మయాంక్​కు ఆరెంజ్​ క్యాప్​.. షమికి పర్పుల్ క్యాప్​

షమీకి పర్పుల్​ క్యాప్​

టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో 8 వికెట్లతో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ బౌలర్ షమీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ క్యాపిటల్స్​ బౌలర్​ కగిసో రబాడా (మూడు మ్యాచ్​ల్లో 7 వికెట్లు), ముంబయి ఇండియన్స్​ స్పిన్నర్​ రాహుల్​ చాహర్​(నాలుగు మ్యాచ్​ల్లో ఆరు వికెట్లు)లు ఉన్నారు.

అయితే ఆరెంజ్​, పర్పుల్​ క్యాప్​లు టోర్నీ జరిగే సమయంలో చేతులు మారుతూ ఉంటుంది. ఐపీఎల్​ ముగిసే సమయానికి ఎవరైతే అగ్రస్థానంలో ఉంటారో వారికే ఈ క్యాప్​లను చివర్లో బహుకరిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.