ETV Bharat / sports

ముగ్గురు హిట్టర్లు ఉండటం ముంబయి అదృష్టం: రోహిత్​

author img

By

Published : Oct 5, 2020, 11:21 AM IST

తమ జట్టులో ముగ్గురు హిట్టర్లు ఉండటమే సన్​రైజర్స్​పై విజయానికి ప్రధాన కారణమని రోహిత్ శర్మ చెప్పాడు. ఈ మ్యాచ్​లో తమ బౌలర్లు అద్భుతం చేశారని పేర్కొన్నాడు.

Rohit Sharma
రోహిత్​ శర్మ

తమ జట్టులో ముగ్గరు హిట్టర్లు ఉండటం చాలా మంచిదైందని ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ తెలిపాడు. ఆదివారం జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​పై గెలిచిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి.. 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఎంతో ప్రయత్నించినా సరే హైదరాబాద్​కు ఓటమి తప్పలేదు. ముంబయిలో​ క్వింటన్​ డికాక్​(67), ఇషాన్​ కిషన్​(31), హార్దిక్​ పాండ్య(28) గెలుపులో కీలక పాత్ర పోషించారు.

Rohit Sharma
రోహిత్ శర్మ

"ఆటగాళ్ల ప్రదర్శన బాగున్నప్పటికీ, కాస్త నెమ్మదిగా సాగినట్లు కనిపించింది. అలాంటి పరిస్థితుల్లో 200 స్కోరు చేయడమంటే గొప్ప ప్రయత్నమనే చెప్పాలి. మా బౌలర్లు ఈ సారి అద్భుతం చేశారు. నేను కొన్ని అవకాశాలను మిస్​ చేశా.. కానీ అవి వచ్చినప్పుడల్లా మన వంతు ప్రయత్నం చేయాలి. అద్భుతమైన స్కోరును సాధించిన కుర్రాళ్లకు అభినందనలు. మ్యాచ్​ సాగే పరిస్థితిని బట్టే మిడిల్​ ఆర్డర్​ను నిర్ణయిస్తాం. ఈ నేపథ్యంలో జట్టులో ముగ్గురు పవర్​ హిట్టర్లు ఉండటం చాలా మంచి విషయం"

రోహిత్​ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్​

ఈ మ్యాచ్​లో ముంబయి బౌలర్లు​ బుమ్రా, పాటిన్సన్​, బౌల్ట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. "ఎన్ని ప్రణాళికలతో వచ్చినా కొన్నిసార్లు అది పనిచేయకపోవచ్చు. ఆ సమయంలోనే అత్యుత్తమ డెలివరీ వేయాల్సి ఉంటంది. నా ప్రణాళికలను వారిపై రుద్దను. వారేమనుకుంటున్నారో తెలుసుకుంటా. దాన్ని బట్టే ఫీల్డింగ్​ ఏర్పాటు చేస్తాను" అని రోహిత్​ పేర్కొన్నాడు.

Rohit Sharma
సన్​రైజర్స్​పై విజయం సాధించిన ముంబయి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.