ETV Bharat / sports

'దినేశ్​ కార్తిక్​ సారథ్యంలో జట్టు మెరుగ్గానే ఉంది'

author img

By

Published : Oct 9, 2020, 5:17 PM IST

కెప్టెన్​ దినేశ్​ కార్తిక్​ నాయకత్వంలో జట్టు ప్రస్తుతం మెరుగ్గానే ఉందని అభిప్రాయపడ్డాడు కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాట్స్​మన్​ ఇయాన్​ మోర్గాన్​. కెప్టెన్​, వైస్​ కెప్టెన్​ సహా సీనియర్​ ఆటగాళ్లందరి సలహాలు ప్రతిఒక్కరూ పాటిస్తారని తెలిపాడు. వారి బాధ్యతలకు ఒక పేరు పెట్టలేమని స్పష్టం చేశాడు.

DK and Brendon McCullum lead extremely well, says Eoin Morgan
'దినేశ్​ కార్తిక్​, మెక్కల్లమ్​ సారథ్యంలో జట్టు మెరుగ్గాఉంది'

దినేశ్​ కార్తిక్​ కెప్టెన్సీ బాగుందని అంటున్నాడు కోల్​కతా నైట్​ రైడర్స్ బ్యాట్స్​మన్​ ఇయాన్​ మోర్గాన్​. 'ఇంగ్లాండ్​కు ప్రపంచకప్​ తెచ్చిన కెప్టెన్​గా మీకున్న అనుభవానికి దినేశ్​ కార్తిక్ మిమ్మల్ని​ సలహాలు అడుగుతాడా?' అన్న ప్రశ్నకు మోర్గాన్​ ఈ విధంగా సమాధానమిచ్చాడు.

"దినేశ్​ కార్తిక్​ కెప్టెన్సీ ఇప్పటివరకు బాగా పనిచేసిందని నేను భావిస్తున్నా. అదే విధంగా డీకేతో పాటు కోచ్​ బ్రెండన్​ మెక్​కలమ్ సారథ్యంలో జట్టు సరైన బాటలో నడుస్తుందని అనుకుంటున్నా.​ మా జట్టులో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వారు కూడా జట్టు కోసం సలహాలు, సూచనలు ఇస్తుంటారు. కానీ వారి బాధ్యతలకు ఓ పేరు పెట్టలేం."

- ఇయాన్​ మోర్గాన్​, కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాట్స్​మన్​

డ్రెస్సింగ్​ రూమ్​లో వివిధ భాషలు, నేపథ్యాలు, సంస్కృతుల ఆటగాళ్లతో కలిసి ఆడటాన్ని చాలా బాగా ఆస్వాదిస్తున్నానని మోర్గాన్​ అన్నాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లతో తనకు అపురూప జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపాడు. కేకేఆర్​ బ్యాటింగ్​ గురించి ప్రస్తావించగా.. మిడిల్​ ఆర్డర్​ చాలా బాగుందని చెప్పాడు. ఆడే ప్రత్యర్థిని బట్టి బ్యాటింగ్​ ఆర్డర్​లో మార్పులు చేస్తామని మోర్గాన్​ వెల్లడించాడు.

DK and Brendon McCullum lead extremely well, says Eoin Morgan
బ్రెండన్​ మెక్​కలమ్

ప్రస్తుత ఐపీఎల్​లో మూడు విజయాలను నమోదు చేసుకున్న కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.