ETV Bharat / sports

కోల్​కతాతో మ్యాచ్​లో దిల్లీ రికార్డుల మోత!

author img

By

Published : Oct 4, 2020, 9:29 AM IST

షార్జా వేదికగా జరిగిన కోల్​కతా- దిల్లీ​ మ్యాచ్​లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇంతకీ అవేంటి? ఎవరు నమోదు చేశారు?

DC overcome KKR in IPL 2020
దిల్లీ

షార్జా వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో శనివారం జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ గెలిచింది. 18 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది దిల్లీ. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్​ ధావనతో పాటు కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ అద్భుతంగా ఆడారు. అనంతరం ఛేదనకు దిగిన కోల్​కతా.. చివరి వరకు పోరాడి ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి.

షా, అయ్యర్​ విజయాలు

ఈ మ్యాచ్​లో పృథ్వీ షా 41 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. దీంతో లీగ్​లో ఆరు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. మరోవైపు 88 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచిన అయ్యర్​(1,851)... ఐపీఎల్​లో 1,850 మార్కును అధిగమించాడు. లీగ్​​ కెరీర్​లో 14వ అర్థసెంచరీ నమోదు చేశాడు.

DC overcome KKR in IPL 2020
దిల్లీ vs కోల్​కతా

రెండో స్థానంలో దిల్లీ

228 పరుగులతో ఐపీఎల్​ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా దిల్లీ రెండో స్థానంలో నిలిచింది. కేకేఆర్​పై ఇప్పటివరకు ఆడిన జట్లలో దిల్లీదే అత్యధిక స్కోరు. లీగ్​లో 200 పరుగుల మార్కును చేరుకోవడం దిల్లీకి ఇది ఏడోసారి.

ఇదే సీజన్​లో షార్జాలో జరిగిన వరుసగా మూడు మ్యాచ్​ల్లో 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఈ సీజన్​లో అత్యధిక స్కోరు దిల్లీదే.

DC overcome KKR in IPL 2020
ఐపీఎల్​ పాయింట్ల పట్టిక

కేకేఆర్​పై ధావన్​, అయ్యర్​ ఘనతలు

కోల్​కతాపై అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లలో ధావన్(682)​ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇదే జట్టుపై అయ్యర్​ రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇప్పటివరకు కోల్​కతాతో 11 మ్యాచ్​లు ఆడి.. 30 ఫోర్లు, 22 సిక్సర్లు బాదాడు.

మరికొన్ని రికార్డులు

నితీశ్ రానాకు ఐపీఎల్​ కెరీర్​లో ఇది 50వ మ్యాచ్​. ఇందులో 35 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అమిత్​ మిశ్రా(1/14) తన కెరీర్​లో 160 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా రబాడా నిలిచాడు. అతనితో పాటు మరో ఆటగాడు అదే స్థానంలో కొనసాగుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.