ETV Bharat / sports

ఐపీఎల్​: క్యాచులు వదిలితే తప్పదు భారీమూల్యం!

author img

By

Published : Sep 27, 2020, 5:55 PM IST

ఐపీఎల్​ అంటేనే అటు క్రీడాభిమానులకు, ఇటు ఆటగాళ్లకు భలే మజాగా ఉంటుంది. ఈ లీగ్​లో ప్రతి ఫ్రాంచైజీ గెలుపుకోసమే పరితపిస్తుంటుంది. అయితే చిన్నచిన్న తప్పుల వల్ల మధ్యలోనే వెనుదిరగాల్సి వస్తుంది. అలా క్యాచ్​లను జారవిడిచి, ఫలితంగా ఓడిపోయి భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటి గురించే ఈ కథనం.

5 costliest dropped catches in IPL history
ఐపీఎల్​

ఎప్పటిలాగే ఈ ఏడాది ఐపీఎల్​, భారీ అంచనాలతో ప్రారంభమైంది. తొలివారం పూర్తయ్యేసరికి ఎనిమిది మ్యాచ్​లు జరిగాయి. ఒక్కో మ్యాచ్​ ఎంతో ఉత్కంఠగా సాగింది. భారీ విజయాలు, పలువురు ఆటగాళ్లకు గాయాలు, పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న ఫ్రాంచైజీలు.. ఇలా అనేక క్రేజీ విషయాలతో లీగ్​ రసవత్తరంగా మారింది.

తొలి వారంలో మైదానాల్లో జట్లు చేసిన లోపలూ ఉన్నాయి. వచ్చిన క్యాచ్​ను వదిలేయడం వల్ల, మ్యాచ్​ మలుపులు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్​ చరిత్రలోనే ఐదు అత్యంత విలువైన క్యాచ్​ డ్రాపింగ్​లపై లుక్కేద్దాం.

బెంగళూరు మ్యాచ్​లో కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​(132) బ్యాటింగ్​లో అదరగొట్టి పలు రికార్డులు నెలకొల్పాడు. ఈ మ్యాచ్​లో రాహుల్​ ఇచ్చిన రెండు క్యాచ్​​లనూ కెప్టెన్​ కోహ్లీ జారవిడిచాడు. అలా విరాట్​ చేసిన తప్పుకు ఫలితంగా ఓటమితో ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

యూఏఈ వేదికగా 2014 ఐపీఎల్​లో జరిగిన సంఘటన. చెన్నై సూపర్​ కింగ్స్​ 205 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్​ ముందుంచింది. ఛేదనలో పుజారా(13), సెహ్వాగ్(19) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్​వెల్​ 37 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్​ను నెహ్రా వదిలేశాడు. దీంతో చెలరేగిపోయిన మ్యాక్సీ​.. 95 పరుగులతో జట్టు విజయానికి కారణమయ్యాడు.

  • If RP hadn't overstepped that night...if Kohli hadn't dropped Miller...ifs and buts RCB likely to think about till IPL-7!

    — Aakash Chopra (@cricketaakash) May 19, 2013 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2013లో ఆర్సీబీకి కోహ్లీ తొలిసారి కెప్టెన్​గా బాధ్యతలు అందుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్​తో మ్యాచ్​. బెంగళూరు బౌలర్ల ధాటికి పంజాబ్​ 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం వచ్చిన డేవిడ్​ మిల్లర్​ విధ్వంసాన్ని ఎవరూ ఊహించలేదు. ఒకానొక సందర్భంలో మిల్లర్​ క్యాచ్​ను కెప్టెన్​ కోహ్లీ జారవిడిచాడు. ఫలితంగా పంజాబ్​ గెలిచేసింది. అదే మ్యాచ్​లో మిల్లర్ 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఐపీఎల్​ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్​మన్​లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

2014లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ కోల్​కతా నైట్​రైడర్స్ మధ్య మ్యాచ్. యూసఫ్​ పఠాన్ అద్భుత బ్యాటింగ్​ అందరినీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్​లో కేవలం 15 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడీ ఆల్​రౌండర్. కోల్​కతా తరఫున మైదానంలోకి వచ్చినప్పుడు తొలి బంతికే క్యాచ్​ ఔట్​ కావాల్సింది. కానీ అనిరుద్ధ శ్రీకాంత్​ దాన్ని జారవిడిచాడు. ఆ తర్వాత 15 పరుగుల వద్ద మరో క్యాచ్​ ఇవ్వగా.. ఆ అవకాశాన్ని కూడా స్టెయిన్ వదిలేశాడు. దీంతో సన్​రైజర్స్ మ్యాచ్​ ఓడిపోయింది.

  • #OnThisDay in 2️⃣0️⃣0️⃣9️⃣ against the Deccan Chargers, Manish Pandey created history by becoming the first Indian to score a century in the IPL, and led RCB to a memorable win at the Centurion! 🤩

    Runs: 1️⃣1️⃣4️⃣* (73)
    4s: 1️⃣0️⃣
    6s: 4️⃣
    S/r: 1️⃣5️⃣6️⃣.1️⃣6️⃣ 🔥#PlayBold pic.twitter.com/UCJNqMuy9k

    — Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2009 ఐపీఎల్​లో జరిగిన సంఘటన. బెంగళూరు జట్టులో రాహుల్​ ద్రవిడ్​, అనిల్​ కుంబ్లే, జాక్వస్​ కలీస్ లాంటి అద్భుత ప్లేయర్లు ఉన్నారు. కానీ దక్కన్​ చార్జర్స్​తో మ్యాచ్​లో వరుసగా వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలో దిగిన మనీశ్​ పాండే, రెండు పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఆర్పీ సింగ్​కు క్యాచ్​ ఇచ్చాడు. కానీ దానిని జారవిడిచాడు.​ ఆ తర్వాత తన బ్యాటింగ్​తో దక్కన్​ చార్జర్స్​ బౌలర్లకు చుక్కలు చూపించాడు మనీశ్. 73 బంతుల్లో 114 పరుగులు చేసి ఐపీఎల్​లో శతకం చేసిన తొలి భారత బ్యాట్స్​మన్​గా ఘనత సాధించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.