ETV Bharat / sports

'కోహ్లీపై ఒత్తిడి తగ్గాలంటే.. కేఎల్​ రాహుల్​ రాణించాల్సిందే'

author img

By

Published : Oct 14, 2021, 10:26 PM IST

టీమ్ఇండియా ఓపెనింగ్​ బ్యాటర్​ కేఎల్​ రాహుల్​ అద్భుతంగా రాణిస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ బ్రెట్​ లీ అన్నాడు. ఐపీఎల్​లో అత్యధిక పరుగులు చేసిన కేఎల్​ రాహుల్​.. టీ20 ప్రపంచకప్​లోనే టాప్​ స్కోరర్​గా నిలిచే అవకాశం ఉందని తెలిపాడు. కేఎల్​ రాహుల్​ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే.. కెప్టెన్​ కోహ్లీపై ఒత్తిడి తగ్గుతుందని అన్నాడు.

India should build around KL Rahul, it will ease pressure off Virat Kohli, says Brett Lee
'కోహ్లీపై ఒత్తిడి తగ్గాలంటే.. కేఎల్​ రాహుల్​ రాణించాల్సిందే'

అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ టీ20 ప్రపంచకప్​లో రాణిస్తే.. కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై ఒత్తిడి ఉండదని ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ బ్రెట్ లీ అన్నాడు. అప్పుడు కోహ్లీ స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశముంటుందని అతడు పేర్కొన్నాడు.

"ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రాహుల్‌.. టీ20 ప్రపంచకప్‌లో కూడా టాప్ స్కోరర్‌గా నిలుస్తాడు. భారత బ్యాటింగ్‌కు అతడు వెన్నెముక. రాహుల్ మెరుగ్గా రాణిస్తే.. కోహ్లీపై ఒత్తిడి తగ్గుతుంది. కెప్టెన్‌గా కోహ్లీకిదే చివరి టీ20 ప్రపంచకప్‌ కాబట్టి.. అతడు తన సహజ శైలిలో స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశముంటుంది. ఇటీవల భారత్ అన్ని ఫార్మాట్లలో ఆధిపత్యం చలాయిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కారణంగా నాణ్యమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ కూడా మెరుగ్గా రాణిస్తుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం".

- బ్రెట్​లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​

"పొట్టి ఫార్మాట్లో ఇంగ్లాండ్ బలమైన జట్టు. అనుభవమున్న ఆటగాళ్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మిగతా జట్లకు వారి నుంచి ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుంది. నాకు భారత్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. గత కొద్ది కాలంగా ఆస్ట్రేలియా పొట్టి ఫార్మాట్లో రాణించలేకపోతోంది. అయితే, ఈ టీ20 ప్రపంచకప్‌కు అత్యుత్తమ జట్టును ఎంపిక చేసింది. టైటిల్ పోరులో అది కచ్చితంగా భారత్‌కు గట్టి పోటీనిస్తుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడిగా కచ్చితంగా మా జట్టే కప్‌ గెలవాలని బలంగా కోరుకుంటున్నా" అని బ్రెట్‌ లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, ఈ నెల 20న ఆస్ట్రేలియా, భారత్ జట్లు దుబాయ్‌లో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి.

ఇదీ చూడండి.. 'ఇంగ్లాండ్​తో మ్యాచ్​ అంటే భయపడాల్సిందే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.