ETV Bharat / sports

భరత్​ గురించి ద్రవిడ్ అప్పుడే చెప్పాడు: లక్ష్మణ్

author img

By

Published : Nov 28, 2021, 12:55 PM IST

IND vs NZ Test 2021: న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో సాహా స్థానంలో కీపింగ్​కు వచ్చిన కేఎస్ భరత్ ఆకట్టుకున్నాడు. వికెట్ల వెనుక సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఇతడు మూడు వికెట్లు తీయడంలో పాలుపంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో ఇతడి ప్రదర్శనపై స్పందించిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. ద్రవిడ్​ అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని భరత్ నిలబెట్టుకున్నాడని తెలిపాడు.

Laxman praises KS Bharat , Laxman on Ks Bharat keeping, కేఎస్ భరత్ లక్ష్మణ్, భరత్​పై లక్ష్మణ్ ప్రశంసలు
భరత్

VVS Laxman Praises KS Bharat: టీమ్‌ఇండియా యువ కీపర్‌, బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శనివారం భరత్‌.. వృద్ధిమాన్‌ సాహాకు గాయం కారణంగా ఇతడికి బదులుగా వికెట్‌ కీపింగ్‌ చేశాడు. ఈ సందర్భంగా అతడు మూడు కీలక వికెట్లు తీయడంలో భాగస్వామి అయ్యాడు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ భరత్‌ కీపింగ్‌ నైపుణ్యాలను మెచ్చుకున్నాడు. అతడి గురించి ద్రవిడ్‌ తనతో ముందే ఓసారి చర్చించాడని పేర్కొన్నాడు. భారత్‌లో సాహా తర్వాత అంత మంచి కీపర్‌ ఈ ఆంధ్రా క్రికెటరే అని పేర్కొన్నాడని గుర్తుచేసుకున్నాడు.

"భరత్‌.. సెలెక్టర్లు, కోచ్‌ ద్రవిడ్‌ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా మంచి పరిణామం. వాళ్ల విశ్వాసాన్ని నిలబెట్టుకొనేలా ఆడాడు. స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలించే ఇలాంటి పిచ్‌లపై సరైన కీపర్‌ లేకపోతే పలు అవకాశాలు చేజారతాయి. ఈరోజు భరత్‌ నుంచి మనం చూసింది అత్యద్భుతమైన ప్రదర్శన. కొద్ది రోజుల క్రితమే జట్టులోకి వచ్చి.. అనుకోకుండా అందిన అవకాశాన్ని నిర్భయంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇది అతడికి మంచి అనుభవంగా పనికొస్తుంది. అతడి కెరీర్‌ ముందుకు సాగడానికి ఇది మరింత తోడ్పడుతుంది. ఈ ప్రదర్శనతో అతడికి మంచి ఆత్మవిశ్వాసం లభిస్తుంది."

-లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

IND vs NZ Test 2021: ఈ మ్యాచ్​లో సాహా స్థానంలో కీపింగ్​కు వచ్చాక.. తొలుత విల్‌ యంగ్‌(89) క్యాచ్‌ అందుకోవడమే కాకుండా అంపైర్‌ దాన్ని నాటౌట్‌గా ప్రకటించినా.. పూర్తి విశ్వాసంతో కెప్టెన్‌ రహానె రివ్యూకు వెళ్లేలా చేశాడు భరత్. అక్కడ విల్‌ ఔటని తేలడం వల్ల 151 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం రాస్‌ టేలర్‌ (11) వంటి ప్రమాదకర బ్యాటర్ను.. భరతే వికెట్ల వెనుక మళ్లీ క్యాచ్‌ అందుకొని పెవిలియన్‌ పంపాడు. ఇక టాప్‌ స్కోరర్‌గా నిలిచిన టామ్‌ లాథమ్‌ (95)ను కూడా అతడే స్టంపౌట్‌ చేసి న్యూజిలాండ్‌ను దెబ్బతీశాడు.

ఇవీ చూడండి: IPL Auction 2022: అందరి చూపు శ్రేయస్ వైపే.. ఎవరికి దక్కేనో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.