ETV Bharat / sports

IND VS SA: టీమ్​ఇండియాకు భారీ జరిమాన

author img

By

Published : Jan 24, 2022, 3:43 PM IST

Teamindia slow over rate: దక్షిణాఫ్రికాపై టెస్టు, వన్డే సిరీస్​లు కోల్పోయిన టీమ్​ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో స్లో ఓవర్​ రేట్​ కారణంగా భారత జట్టుకు మ్యాచ్​ ఫీజులో 40 శాతం కోత విధించింది ఐసీసీ.

India fined for slow over-rate
India fined for slow over-rate

Teamindia fine: టీమ్​ఇండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికాపై టెస్టు, వన్డే సిరీస్​ కోల్పోయిన భారత జట్టుకు మరో షాక్​ తగిలింది. ఆదివారం ఉత్కంఠంగా సాగిన మూడో వన్డేలో 4పరుగుల తేడాతో ఓడిపోయిన మన టీమ్​కు భారీ జరిమానా విధించింది ఐసీసీ. స్లో ఓవర్​ రేటు కారణంగా రాహుల్​ సేనకు.. మ్యాచ్​ ఫీజులో 40శాతం కోత విధించింది.

ఐసీసీ నిబంధనలలో భాగంగా ఆర్టికల్​ 2.22 ప్రకారం .. నిర్దేశిత సమయంలో వేయాల్సిన ఓవర్లు కన్నా తక్కువ ఓవర్లు వేసినందుకు జరిమానా విధించినట్లు పేర్కొంది. కాగా, దక్షిణాఫ్రికాతో వన్డే, టెస్టు సిరీస్​లలో కలిపి మొత్తంగా ఆరు మ్యాచులు ఆడగా టీమ్​ఇండియా ఒక్కటి మాత్రమే గెలిచింది.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

కోహ్లీ విజయాలను జీర్ణించుకోలేకపోయారు: రవిశాస్త్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.