ETV Bharat / sports

Ind vs Wi 4th T20 : అదరగొట్టిన ఓపెనర్లు.. విండీస్​ను చిత్తు చేసిన భారత్.. 2 - 2 తో సిరీస్ సమం

author img

By

Published : Aug 13, 2023, 6:33 AM IST

Updated : Aug 13, 2023, 8:10 AM IST

Ind vs Wi 4th T20
భారత్ వర్సెస్ విండీస్ టీ20

Ind vs Wi 4th T20 : అమెరికా గడ్డపై భారత్ అదరగొట్టింది. గత మ్యాచ్ జోరును కొనసాగిస్తూ.. నాలుగో టీ20లోనూ విజయాన్ని నమోదు చేసింది. 179 పరుగుల టార్గెట్​ను అలవోకగా ఛేదించి ఐదు మ్యాచ్​ల సిరీస్​ను 2 - 2 తో సమం చేసింది. కాగా ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ ఆదివారం జగనుంది.

Ind vs Wi 4th T20 : టీమ్ఇండియా అదరగొట్టింది. విండీస్​పై వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్​లో తొమ్మిది వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. 179 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 17 ఓవర్లలోనే ఛేదించింది. టీమ్ఇండియా యంగ్​ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ (84 పరుగులు, 11x4, 3x6), శుభ్​మన్ గిల్​ (77 పరుగులు, 3x4, 5x6) రాణించారు. విండీస్​ బౌలర్లలో షెపర్డ్ ఒక వికెట్ (1/35) దక్కింది. తుపాన్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్న జైశ్వాల్​కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

ఆరంభం ఘనంగా.. ఓ మోస్తారు లక్ష్య ఛేదనకు దిగిన భారత్​కు అద్భుతమైన ఆరంభం లభించింది. ఓపెనర్లు గిల్, జైశ్వాల్.. ప్రత్యర్థి బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక గత మ్యాచ్​ల్లో ఘోరంగా విఫలమైన శుభ్​మన్ గిల్ మళ్లీ తన ఫామ్ అందుకున్నాడు. ఓపెనర్​లు ఇద్దరూ తొలి వికెట్​కు 15.3 ఓవర్లలోనే 165 భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కావాల్సిన పరుగులు తక్కువే ఉండటం వల్ల.. వన్ డౌన్​లో వచ్చిన తిలక్ వర్మ (7 పరుగులు నాటౌట్) తో కలిసి జైశ్వాల్ మిగిలిన పనిని పూర్తి చేశాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. ఇన్నింగ్స్​ను దూకుడుగా ఆరంభించింది. కానీ ఆరు, ఏడు వరుస ఓవర్లలో భారత బౌలర్లు.. కీలక వికెట్లు పడగొట్టి, విండీస్​ను ఇబ్బందుల్లోకి నెట్టారు. ఏడు ఓవర్లు ముగిసేసరికి విండీస్ 57-4 తో నిలిచింది. కానీ షై హోప్ (45 పరుగులు, 3×4, 2×6), హెట్‌మయర్‌ (61 పరుగులు, 3×4, 4×6) కలిసి వెస్టిండీస్​ను ఆదుకున్నారు. 13 వ ఓవర్లో హోప్ ఔటైనా.. హెట్‌మయర్‌ దూకుడుగా ఆడాడు. దీంతో విండీస్.. నిర్ణిత 20 ఓవర్లు ఆడి ఎనిమిది వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3, కుల్‌దీప్‌ యాదవ్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్​ను భారత్.. 2 - 2తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.

Ind vs Wi 4th T20 : చాహల్​కు 'GTA'.. అర్షదీప్​కు 'షాపింగ్'.. యూఎస్ఏ అనగానే మనోళ్లకు గుర్తొచ్చేవి ఇవేనట!

India vs West Indies 4th T20 : హార్దిక్​ సేనకు మరోసారి అదే పరిస్థితి.. ఇక ఆ ఇద్దరు బరిలోకి దిగాల్సిందే..

Last Updated :Aug 13, 2023, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.