ETV Bharat / sports

Ind vs Wi 4th T20 : చాహల్​కు 'GTA'.. అర్షదీప్​కు 'షాపింగ్'.. యూఎస్ఏ అనగానే మనోళ్లకు గుర్తొచ్చేవి ఇవేనట!

author img

By

Published : Aug 12, 2023, 2:56 PM IST

Updated : Aug 12, 2023, 3:07 PM IST

Ind vs Wi 4th T20
చాహల్​కు జీటీఏ అర్షదీప్​కు షాపింగ్

Ind vs Wi 4th T20 : అమెరికా పేరు వినగానే మన క్రికెటర్ల మదిలో వచ్చే ఆలోచన, వారికి గుర్తొచ్చే విషయాలు ఏంటో ఫ్యాన్స్​కు చెప్పారు. మరి ఎవరెవరి ఆలోచలు, వారికి గుర్తొచ్చే విషయాలేంటో తెలుసుకుందాం.

Ind vs Wi 4th T20 : అమెరికా అంటే మనకే కాదండోయ్.. సెలెబ్రిటీలకూ మక్కువ ఉంటుంది. దీనికి మన క్రికెటర్లు ఏ మాత్రం భిన్నం కాదు. వారికీ యూఎస్​ఏ అనగానే కొన్ని జ్ఞాపకాలు, ఇష్టమైన ప్రదేశాలు ఉంటాయి. ఆయితే వెస్టిండీస్​తో నాలుగో టీ20 ఆడేందుకు టీమ్ఇండియా అమెరికా చేరుకుంది.

శనివారం సాయంత్రం విండీస్ - భారత్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో మన ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్​లో ఉండగా.. టీమ్ఇండియా మేనేజ్​మెంట్ వారి వద్దకు వెళ్లి 'అమెరికా అనగానే మీకు గుర్తొచ్చేవి ఏంటి'? అని ఒక్కొక్కరిని అడిగింది. వారు చెప్పిన సమాధానాలను వీడియో తీసి బీసీసీఐ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి ఎవరు ఏమన్నారంటే..

పేస్ బౌలర్ అర్షదీప్​ సింగ్​ను ఈ ప్రశ్న అడగ్గా.."అమెరికా అనగానే మొట్టమొదటగా ఫ్లోరిడా మియామిలో షాపింగ్ చేయడం గుర్తుకు వస్తుంది" అని సమాధానం చెప్పాడు. అమెరికా పేరు వినడమే కాని ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు రావడం హ్యాపీగా ఉంది. యూఎస్​ఏ బాగుంది అని మరో బౌలర్ ముకేశ్ కుమార్ అన్నాడు.

ఇక యంగ్ స్టార్ యశస్వీ యూఎస్​ అంటే లైఫ్​స్టైల్ అని అనగా.. "నాకు మాత్రం ప్రత్యేకంగా మియామి రోడ్లు, భవనాలు, కార్లు చూస్తే.. జీటీఏ (వైస్​సిటీ గేమ్​) గుర్తొస్తుంది" అని స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బదులిచ్చాడు. మరి మిలిగిన స్టార్లు ఏమన్నారో వీడియో చూసి తెలుసుకోండి.

కాగా ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో 2 - 1తో విండీస్ భారత్ కంటే ముందుంది. ఇక మూడో టీ20లో గెలుపు రుచి చూసిన యువ భారత్ జట్టు.. నాలుగో మ్యాచ్​లోనూ తమ జోరును కొనసాగించాలని ఆశిస్తోంది. సిరీస్​లో సజీవంగా ఉండాలంటే టీమ్​ఇండియా ఈ మ్యాచ్​లో​ తప్పక గెలవాలి. మరోవైపు టెస్టు, వన్డే సిరీస్​ను పోగొట్టుకున్న విండీస్.. ఎలాగైనా ఈ మ్యాచ్​లో విజయం సాధించి టీ20 సిరీస్​ను అయినా దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. కాగా శనివారం ఫ్లోరిడా సెంట్రల్ బ్రొవార్డ్ మైదానం వేదికగా నాలుగో మ్యాచ్​ జరగనుంది.

India vs West Indies 4th T20 : హార్దిక్​ సేనకు మరోసారి అదే పరిస్థితి.. ఇక ఆ ఇద్దరు బరిలోకి దిగాల్సిందే..

Ind Vs Wi 3rd T20 : గంభీర్​ రికార్డు బ్రేక్​ చేసిన తిలక్​ వర్మ.. టీమ్​ఇండియా తొలి బౌలర్​గా కుల్​దీప్​!

Last Updated :Aug 12, 2023, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.