ETV Bharat / sports

IND VS SL: కోహ్లీ, సిరాజ్​.. ఈ ఇంట్రెస్టింగ్​​ వీడియోస్​ చూశారా?​

author img

By

Published : Jan 16, 2023, 10:48 AM IST

Updated : Jan 16, 2023, 11:27 AM IST

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ, సిరాజ్​కు సంబంధించి కొన్ని ఆసక్తికర వీడియోలు సోషల్​మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని ఓ సారి చూసేద్దాం..

IND VS SL third ODI kohli videos viral in Social Media
IND VS SL: కోహ్లీ, సిరాజ్ రియాక్షన్​.. ఈ ఇంట్రెస్ట్​ వీడియోస్​ ఫుల్​ వైరల్​

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేకు సంబంధించి మైదనంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలు సోషల్​మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కోహ్లీ, సిరాజ్​ గురించి ఉన్నాయి. అవేంటంటే..

అభిమాని చర్యకు కోహ్లీ రియాక్షన్​.. ఈ మ్యాచ్‌లో విరాట్ 110 బంతుల్లో 166 * 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో చెలరేగాడు. అతడికే ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ అవార్డు దక్కాయి. అయితే ఈ మూడో మ్యాచ్‌ భారత ఇన్నింగ్స్​లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్​ సంఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌ 45 ఓవర్‌ వేసిన కరుణరత్నే బౌలింగ్‌లో తొలి బంతిని విరాట్​ లాంగ్‌ ఆన్‌ దిశగా స్టాండ్స్‌కు తరిలించాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న అభిమాని బంతిని అందుకున్నాడు. అయితే ఆ అభిమాని బంతిని తిరిగివ్వకుండా దాన్ని ఫోటో తీసుకుంటూ ఉండి పోయాడు. దీంతో తర్వాత బంతిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్న కోహ్లీ.. అభిమాని చర్యను చూసి వింత మొహం పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికి ఆ ఫ్యాన్​ బంతిని తిరిగి అందించాడు. ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

విరాట్​ హెలీ కాఫ్టర్​ షాట్​.. ఇక ఈ మ్యాచ్‌లో అద్భతమైన హెలికాప్టర్ షాట్​ను బాది టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీని గుర్తుచేశాడు కోహ్లీ. భారత ఇన్నింగ్స్‌ 44 ఓవర్‌ వేసిన కసున్ రజిత బౌలింగ్‌లో నాలుగో బంతిని విరాట్‌ లాంగ్‌ ఆన్‌ దిశగా 97 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. ఈ అద్భుతమైన షాట్‌ చూసి ఆశ్చర్యపోయిన అభిమానులు.. ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించి వైరల్​ చేస్తున్నారు.

మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్​.. ఈ మ్యాచ్​లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌ జరుగుతుండగా కోహ్లికి వీరాభిమాని అయిన ఒక వ్యక్తి మైదానంలోకి పరుగులు తీశాడు. నేరుగా విరాట్​ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన అతడు.. కోహ్లీ కాళ్లకు దండం పెట్టాడు. వెంటనే కోహ్లీ అతడిని పైకి లేవదీశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలానే జరిగాయి.

సిరాజ్​ సంచలన రనౌట్​.. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమ్​ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో సిరాజ్‌ 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ సంచలన రనౌట్‌తో మెరిశాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌ వేసిన సిరాజ్​ బౌలింగ్‌లో నాలుగో బంతిని కరుణరత్నే నాన్‌స్ట్రైకర్‌ వైపు డిఫెన్స్‌ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న సిరాజ్‌ సమయస్ఫూర్తితో రెప్పుపాటులోనే స్ట్రైకర్‌ వైపు స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మేనన్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. అయితే తను క్రీజులో ఉన్నానని భావించిన కరుణరత్నేకు మాత్రం ఊహించని షాక్‌ తగిలింది. ఎందుకంటే కరుణరత్నే క్రీజుకు కొంచెం వెలుపుల ఉన్నట్లు రిప్లేలో సృష్టంగా కన్పించింది. దీంతో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. ఈ ఔట్​తో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు.

టీమ్​ఇండియా సెలబ్రేషన్స్​.. ఇక ఈ మూడో వన్డేలో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం స్టేడియంలోని ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ట్రోఫీని అందుకున్నాడు. అనంతరం కప్పును మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్‌ సిరాజ్‌ (4/32) చేతికి అందించాడు. ఈ సందర్భంగా భారత జట్టు చేసిన సందడిని మీరూ చూసేయండి.

ఇద చూడండి: IND VS SL: వన్డే ప్రపంచకప్​పై కోహ్లీ కామెంట్స్​.. టీమ్​ఇండియాకు అదే బలమంటూ..

Last Updated : Jan 16, 2023, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.