ETV Bharat / sports

వరుసగా ఐదు సార్లు.. రోహిత్-రాహుల్ అరుదైన ఫీట్

author img

By

Published : Nov 20, 2021, 7:00 AM IST

టీ20ల్లో వరుసగా ఐదు అర్ధశతక భాగస్వామ్యాలు నమోదు చేసిన భారత ఓపెనింగ్​ జోడీగా రోహిత్‌-రాహుల్‌(rohit rahul partnership) రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్​తో సిరీస్​లో భాగంగా జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో(IND vs NZ T20) ఈ ఘనత సాధించారు.

rohit, rahul
రోహిత్, రాహుల్

న్యూజిలాండ్​తో సిరీస్​లో భాగంగా జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో(IND vs NZ t20 series) టీమ్​ఇండియా విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. ఈ మ్యాచ్​లో భాగంగానే టీమ్​ఇండియా ఓపెనర్లు కెప్టెన్​ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్(rohit rahul partnership)​ అరుదైన ఫీట్​ను సాధించారు. టీ20ల్లో వరుసగా 5 మ్యాచ్​ల్లో 50 పరుగులకుపైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లుగా నిలిచారు.

మరిన్ని రికార్డులు..

  • అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ల శతక భాగస్వామ్యాలు 5. బాబర్‌-రిజ్వాన్‌ పేరిట ఉన్న రికార్డు సమమైంది.
  • 2016 తర్వాత స్వదేశంలో జరిగిన 13 ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో భారత్‌కు ఇది పదో విజయం. రెండు సిరీస్‌లను డ్రా చేసుకున్న టీమ్‌ఇండియా ఒక దాంట్లో ఓడింది.

అలవోకగా గెలిచి..

న్యూజిలాండ్​తో జరుగుతున్న టీ20 సిరీస్​ను మరో మ్యాచ్​ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది రోహిత్ సేన. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో కివీస్​పై 7 వికెట్లతో విజయం సాధించింది. ఓపెనర్లు కేఎల్​ రాహుల్ (65), రోహిత్ శర్మ (55) దంచికొట్టారు. దీంతో నిర్దేశిత 154 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమ్ఇండియా. కివీస్​ బౌలర్లలో సౌథీ 3 వికెట్లు తీశాడు.

అంతకు ముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కివీస్​.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్ (31), డారిల్‌ మిచెల్ (31) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అయితే గప్తిల్‌ ఔటైన తర్వాత కివీస్‌ పరుగుల వేగం మందగించింది.

టీమ్​ఇండియాలో అరంగేట్ర బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ (2/25) రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌తో బౌలింగ్‌ చేయించకపోవడం గమనార్హం. భారత బౌలర్లలో హర్షల్‌ 2.. దీపక్‌ చాహర్, భువనేశ్వర్‌, అక్షర్‌ పటేల్, అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు.

ఇదీ చదవండి:

కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గప్తిల్- ఆ జాబితాలో టాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.