'రహానె, పుజారాకు టీమ్​ఇండియా అండగా ఉంది'

author img

By

Published : Dec 2, 2021, 8:06 AM IST

రహానె, పుజారా, Pujara performance, Rahane performance, team india new bowling coach
రహానె, పుజారా ()

Pujara performance: గత కొద్దికాలంగా పేలవమైన ప్రదర్శన చేస్తున్న సీనియర్ బ్యాటర్లు పుజారా, రహానెలకు టీమ్​ఇండియా అండగా ఉందని అన్నాడు భారత జట్టు కొత్త బౌలింగ్​ కోచ్​ పరాస్​ మాంబ్రే. టెస్ట్​ క్రికెట్​లో వాళ్లకు తగినంత అనుభవం ఉందని, త్వరలోనే ఫామ్​లోకి వస్తారని అన్నాడు.

Rahane performance: గత కొద్దికాలంగా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న సీనియర్‌ బ్యాటర్లు ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానెలకు టీమ్‌ఇండియా అండగా ఉందని టీమ్‌ఇండియా కొత్త బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే అన్నాడు. టెస్టు క్రికెట్లో వాళ్లకు తగినంత అనుభవం ఉందని.. మునుపటి లయను అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్‌ దూరంలోనే ఉన్నారని చెప్పాడు. గత రెండు సంవత్సరాలుగా రహానె ఫామ్ లేమితో వరుసగా విఫలమవుతున్నారు. మరోవైపు, టెస్టు స్పెషలిస్ట్ పుజారా కూడా గత 16 టెస్టుల్లో ఒక్క శతకం కూడా నమోదు చేయకుండా కొనసాగుతున్నాడు.

"టెస్టు క్రికెట్లో అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారాలకు తగినంత అనుభవం ఉంది. వీరిద్దరూ కలిసి చాలా సార్లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మునుపటి లయను అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్‌ దూరంలోనే ఉన్నారు. అందుకే, ఓ జట్టుగా మేమంతా వాళ్లకు అండగా నిలబడ్డాం. వారి నుంచి టీమ్ఇండియా ఏమి ఆశిస్తుందో వారికి బాగా తెలుసు. వారిద్దరూ పుంజుకుంటే మిడిలార్డర్‌ మరింత బలోపేతమవుతుంది" అని పరాస్‌ మాంబ్రే అభిప్రాయపడ్డాడు.

కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. డిసెంబర్‌ 3 నుంచి ముంబయి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టుకు కెప్టెన్ విరాట్‌ కోహ్లి అందుబాటులోకి రానుండటం వల్ల.. తుదిజట్టులో రహానెకు చోటు లభిస్తుందా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది!

ఇదీ చూడండి: RCB Captain 2022: 'వచ్చే సీజన్​లో ఆర్సీబీ కెప్టెన్ అతడే.. కానీ!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.