ETV Bharat / sports

'ఇమ్రాన్​ ఖాన్​ నాతో మాట్లాడట్లేదు.. ప్రధాని అసలు టచ్​లోనే లేరు'

author img

By

Published : Jun 25, 2022, 7:51 PM IST

Imran Bhai cut off contact with me, havent talked to him for a long time: Ramiz Raja
Imran Bhai cut off contact with me, havent talked to him for a long time: Ramiz Raja

పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ రమీజ్​ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​.. తనతో మాట్లాడట్లేదని.. ప్రస్తుత ప్రధాని అస్సలు టచ్​లోనే లేరని అన్నాడు.

Ramiz Raja: పాక్​ మాజీ ప్రధాని, క్రికెట్​ టీమ్​ మాజీ కెప్టెన్​ ఇమ్రాన్​ ఖాన్​తో చాలా కాలంగా మాట్లాడట్లేదని అన్నాడు పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ) ఛైర్మన్​ రమీజ్​ రాజా. మీడియాతో పలు విషయాలపై మాట్లాడాడు. ఇమ్రాన్​ తనతో సంబంధాలు తెంచుకున్నారని పేర్కొన్న రమీజ్​.. ప్రస్తుత ప్రధాని షాబాజ్​ షరీఫ్​ అసలు టచ్​లోనే లేరని తెలిపాడు.

''ఇమ్రాన్​ భాయ్​ నాతో సంబంధాలు తెంచుకున్నారు. ఆయనతో చాలా కాలంగా మాట్లాడట్లేదు. మేం ఊహాగానాల చుట్టూ బతకలేం. రాజకీయ వైరుద్ధ్యాలను పక్కనపెట్టి.. దీనిని కొనసాగించాలని నేను భావిస్తున్నా. ప్రస్తుత ప్రధాని మాతో కనీసం టచ్​లో లేరు. ఆయనకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మాకోసం సమయం కేటాయిస్తే.. మేం ఆయనను కలిసి మా వర్క్​ గురించి చెబుతాం. ఇక్కడ ఈగోలను పక్కనపెట్టాలని నేనంటా. అందరం కలిసి క్రికెట్​ ఉన్నతికి కృషి చేయాలి.''

- రమీజ్​ రాజా, పాక్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​

తన పదవి ఉంటుందా? పోతుందా? అనే విషయంపైనా స్పందించాడు రమీజ్​. ఒకవేళ పీసీబీ ఛైర్మన్​ పదవిని ప్రతిసారీ తొలగించాలని రాజ్యాంగంలో రాసుంటే అలానే చేయొచ్చని అన్నాడు. వ్యక్తిగత లక్ష్యాలను నెరవేర్చుకోవడం ద్వారా ఆటను ముందుకు తీసుకెళ్లలేమని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా బంతి ఆయన (పీఎం షాబాజ్​ షరీఫ్​) కోర్టులోనే ఉందని తెలిపాడు.

మరోవైపు ఐపీఎల్​పైనా స్పందించాడు రాజా. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ను వీక్షించేందుకు రావాలని.. బీసీసీఐ ఛైర్మన్​ గంగూలీ తనను ఆహ్వానించాడని తెలిపాడు రమీజ్​. ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని గంగూలీ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు వెల్లడించాడు. రాబోయే ఐపీఎల్​కు.. ఐసీసీ స్పెషల్​ విండోను వ్యతిరేకించిన పాక్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ రానున్న సమావేశంలో దీనిని సవాల్​ చేయనున్నట్లు వివరించాడు.

ఇవీ చూడండి: పసికూనతో టీమ్​ఇండియా ఢీ.. తక్కువ అంచనా వేస్తే కష్టమే!

100 సిక్సర్లు.. 100 వికెట్లు.. తొలి టెస్టు క్రికెటర్​గా రికార్డు పుస్తకాల్లోకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.