టెన్నిస్‌ మహిళా నెం.1 ర్యాంకర్‌కూ తప్పని లైంగిక వేధింపులు

author img

By

Published : Nov 24, 2022, 8:46 AM IST

swiatek

పోలాండ్​ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్​ క్రీడాకారిణి స్వియాటెక్ లైంగిక వేధింపులకు గురైంది. అయితే తనపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలను ఆమె స్వయంగా బహిర్గతం చేసింది.

క్రీడల్లో మహిళల పట్ల జరిగే లైంగిక వేధింపుల సంఘటనలను బయటకు చెప్పడం చాలా అరుదు. అయితే టెన్నిస్‌ నంబర్‌వన్ ర్యాంకర్‌ స్వియాటెక్ మాత్రం ధైర్యంగా బహిర్గతం చేసింది. ఆమెకు పోలాండ్‌ పార్లమెంటేరియన్‌ కేథరిన్‌, టెన్నిస్‌ మహిళా దిగ్గజం మార్టినా నవత్రిలోవా మద్దతుగా నిలిచారు.

ప్రస్తుతం టెన్నిస్‌ మహిళల విభాగంలో నంబర్‌వన్ ర్యాంకర్‌ ఇగా స్వియాటెక్. యూఎస్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ను సొంతం చేసుకొంది. అయితే స్వియాటెక్ టీనేజర్‌గా ఉన్న సమయంలో ప్రస్తుత పోలాండ్‌ టెన్నిస్ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మిరోస్లా స్క్రిజిప్‌జిన్‌స్కీ ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు పోలాండ్ పార్లమెంటేరియన్‌ కేథరిన్‌ కొటుల రెండు రోజుల కిందట వెల్లడించడంతో ఒక్కసారిగా సంచలనమైంది. ఆమె వ్యాఖ్యలపై తాజాగా స్వియాటెక్ ట్విటర్‌ వేదికగా స్పందించింది.

"మహిళా టెన్నిస్‌ టాప్‌ర్యాంకర్‌గా ఇలాంటి విషయాలపై మౌనంగా ఉండలేను. పోలిష్ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. బాధితుల గురించి ఆలోచించాలి. ఏం జరిగిందో అనేదానిపై ఫెడరేషన్‌ డైరెక్టర్లు లేదా రిపోర్టర్లు నిజాలను వెలికితీయాలి. అయితే టీనేజ్‌లో కెరీర్‌ను కాపాడిన నా తండ్రికి ధన్యవాదాలు. మా నాన్న వల్లే లైంగిక వేధింపుల బారిన పడకుండా ఉండగలిగాను" అని స్వియాటెక్‌ ట్వీట్‌ చేసింది. స్వియాటెక్‌ స్పందించడంపై టెన్నిస్‌ మాజీ దిగ్గజం మార్టినా నవత్రిలోవా అభినందనలు తెలిపింది.

ఇదీ చదవండి: ఎవరేమనుకున్నా పట్టించుకోను.. ఆ హాట్​టాపిక్​ విషయంపై హార్దిక్​ ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.