ETV Bharat / sports

వరల్డ్​ కప్​లో ఆస్ట్రేలియా‌కు షాక్​, స్టార్ ప్లేయర్ దూరం

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 4:27 PM IST

Updated : Nov 1, 2023, 5:23 PM IST

Glenn Maxwell Injury Update
Glenn Maxwell Injury Update

Glenn Maxwell Injury Update : ప్రస్తుత వరల్డ్​ కప్​లో మంచి ఫామ్​తో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ గాయం కారణంగా​ జట్టుకు దూరమయ్యాడు.

Glenn Maxwell Injury Update : 2023 ప్రపంచ కప్​లో వరుస విజయాలతో దుసుకుపోతున్న ఆస్ట్రేలియా జట్టుకు షాక్​ తగిలింది. గాయం కారణంగా స్టార్​ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ ఇంగ్లాండ్​తో జరిగే మ్యాచ్​కు​ దూరమయ్యాడు. మ్యాచ్​ లేనందువల్ల గోల్ఫ్​ ఆడేందుకు వెళ్లిన మ్యాక్స్​వెల్.. గోల్ఫ్​ కార్ట్​ వెనుక ప్రయాణిస్తున్నప్పుడు జారి కింద పడిపోయాడు. దీంతో అతడి తలకు గాయం అయింది. ఈ మేరకు ఆసీస్​ హెడ్​ కోచ్​ అండ్రూ మెక్​డోనాల్డ్​ తెలిపారు.

Australia Vs England World Cup 2023 : ఏడాది కాలంలో మ్యాక్స్​వెల్​కు ఇది రెండో గాయం. గత నవంబర్​లో మెల్​బోర్న్​లో జరిగిన ఓ పుట్టిన రోజు పార్టీలో మ్యాక్స్​వెల్​ కాలు విరిగింది. అయితే ఆ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఇంతలో ఈ ఘటన జరగడం వల్ల అతడి ఆట తీరుపై ప్రభావం చూపే అవకాశముంది. ఇదిలా ఉండగా.. ఖాళీ సమయం దొరకడం వల్ల ప్లేయర్లు గోల్ఫ్​ ఆడేందుకు వెళ్లారని ఇంగ్లాండ్ హెడ్​ కోచ్​ ఆండ్రూ మెక్​డొనాల్డ్​ తెలిపారు. అయితే అతడి స్థానంలో రిప్లేస్​మెంట్​ అవసరం లేదని చెప్పారు. ప్రోటోకాల్స్​ ప్రకారం.. అతడు 6-8 విరామం తీసుకుంటాడని తెలిపారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్​తో మ్యాచ్​కు ఇప్పుడున్న స్క్వాడ్​ నుంచే ప్లేయర్​ను తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం మార్కస్​ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్ అందుబాటులో ఉన్నారని.. కానీ తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

అయితే సెమీ ఫైనల్​ రేసులో ఉన్న అసీస్​ జట్టులో మ్యాక్స్​వెల్​ లేకపోవడం పెద్ద నష్టమే. టీమ్​లో కీలక ప్లేయర్​గా ఉన్న మ్యాక్స్​వెల్.. ఆల్​రౌండ్​ ప్రదర్శనతో జట్టుకు అండగా నిలుస్తాడు. బౌలర్​ ఆడమ్ జంపాతో కలిసి స్పిన్​ బాధ్యతలను పంచుకుంటాడు. అదే సమయంలో బ్యాట్​తో మిడిలార్డర్​లో కీలక పాత్ర పోషిస్తాడు. మ్యాక్స్​వెల్​.. గతవారం దిల్లీ వేదికగా నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో 40 బంతుల్లో వరల్డ్​ కప్​ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
గతేడాది ఇంగ్లాండ్​ జట్టు వికెట్​ కీపర్ జానీ బెయిర్​స్టో గోల్ఫ్​ ఆడుతున్నప్పుడు జారిపడ్డాడు. దీంతో అతడిని టీ20 వరల్డ్​ కప్​ నుంచి తొలగించారు. కాగా ఆ తర్వాత ఇంగ్లాండ్​ టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్​గా నిలిచింది.

Riyan Parag Domestic Cricket : 9 మ్యాచ్​లు.. 8 అర్ధసెంచరీలు.. ​దేశవాళీలో రియాన్​ రికార్డులు ఇవే!

క్రికెట్​కు స్టార్​ బౌలర్​ గుడ్​బై వరల్డ్​కప్​ తర్వాత రిటైర్మెంట్​

Last Updated :Nov 1, 2023, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.