ETV Bharat / sports

పాకిస్థాన్​కు షాక్!- ఐస్​లాండ్​లో ఛాంపియన్స్​ ట్రోఫీ- ఇదంతా భారత్ పనేనా!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 4:18 PM IST

ICC Championship 2025 : 2025 ఐసీసీ ఛాంపియన్స్​ ట్రోఫీకి పాకిస్థాన్​ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో ఐస్​లాండ్​ క్రికెట్​ అసోషియేషన్​.. ఐసీసీకి ఓ లెటర్​ రాసింది. ఇంతకీ అందులో ఏముందంటే ?

ICC Championship 2025
ICC Championship 2025

ICC Championship 2025 : 2025 ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం కోసం పాకిస్థాన్​ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నా.. ఇంకా ఐసీసీ.. హోస్టింగ్ అగ్రీమెంట్​పై సంతకం చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ దేశానికి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

ఒకవేళ వచ్చే ఛాంపియన్స్​ ట్రోఫీ పాకిస్థాన్​లో జరిగితే.. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా భార‌త జ‌ట్టు ఆ దేశంలో పర్యటించక పోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే టోర్నీ హైబ్రిడ్​లో జరిగే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఐస్​లాండ్ క్రికెట్​ బోర్డు రెడీ అయింది. ఈ మేరకు తాజాగా ఐసీసీకి ఓ లేఖ రాసింది. రానున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణ హ‌క్కులు త‌మ‌కు ఇవ్వాల‌ంటూ ట్విట్టర్​ వేదిక‌గా ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.

"2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఐస్‌లాండిక్ క్రికెట్ అసోసియేషన్ ఆసక్తి కనబరుస్తోంది. పాకిస్థాన్‌లో టోర్నమెంట్ జరగదన్న రూమర్స్​ నేపథ్యంలో మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాము. హైబ్రిడ్ మోడల్​లో ఈ టోర్నీ ఉంటుందన్న విషయం తెలిసింది. ఇక అద్భుతమైన టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ఉపయోగపడే రాతి నేల మా దగ్గర ఉంది. అంతే కాకుండా అగ్నిపర్వతాల ద్వారా ఏర్పడ్డ ఒక రకమైన మట్టి.. నేలపై పడిన నీటిని త్వరగా పీలుస్తుంది. ఆసియా ఖండంలో కనిపించే పేలవమైన డ్రైనేజీలు సమస్యలు ఇక్కడ లేవు" అంటూ ఆ లెటర్​లో తమ అభిప్రయాన్ని వ్యక్తపరిచింది. అంతే కాకుండా "మేము వెన‌క్కి త‌గ్గేవాళ్లం కాదు. ఈరోజు మేము ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యం కోసం బిడ్ వేశాం. గ్రెగ్ బార్‌క్లే బృందం ఈ విషయంపై ఇచ్చే సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం" అంటూ ఆ లెటర్​కు క్యాప్షన్​ను జోడించింది.

  • We are not people who hold back. We have today issued our bid to host the Champions Trophy of 2025, and we look forward to hearing what Greg Barclay of @ICC has to say about it. pic.twitter.com/EsRzsikCqF

    — Iceland Cricket (@icelandcricket) November 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ICC Championship Host : తాజాగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా జరిగిన మీటింగ్‌లో పాక్​ బోర్డు ఐసీసీకి తమ పరిస్థితిని విన్నవించుకుంది. భద్రతా కారణాలు చెప్పి భారత జట్టు 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీకి తమ దేశానికి రాకపోతే పరిహారం ఇవ్వాలంటూ ఐసీసీని కోరినట్లు సమాచారం. అయితే ఛాంపియన్స్‌ ట్రోఫీకి పాక్‌ ఆతిథ్యం ఇస్తున్నట్లు ఐసీసీ ప్రకటించినా.. ఇప్పటిదాకా ఆతిథ్య హక్కుల పత్రంపై సంతకం చేయలేదు.

మాజీ క్రికెటర్​పై ఐసీసీ వేటు- ఆరేళ్ల పాటు నిషేధం- ఎందుకో తెలుసా?

పాక్​లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ​!- ఇండియా రానంటే మాకు పరిహారం చెల్లించాలి : పాకిస్థాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.