ETV Bharat / sports

వ్యాఖ్యాతగా రవిశాస్త్రి రీఎంట్రీ.. ఆ మ్యాచ్​తోనే!

author img

By

Published : Nov 10, 2021, 5:34 AM IST

ravishastri
రవిశాస్త్రి

టీమ్​ఇండియా హెడ్​కోచ్​గా తప్పుకున్న తర్వాత రవిశాస్త్రి(Ravi Shastri News) తన తదుపరి కార్యచరణపై మాట్లాడాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఏడాది జరగనున్న భారత్-ఇంగ్లాండ్ చివరి టెస్టుకు(IND vs ENG 5th Test) వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్(T20 World Cup)​ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన టీమ్​ఇండియా, నమీబియా మ్యాచ్(IND vs Namibia) అనంతరం.. హెడ్​కోచ్​ పదవికి వీడ్కోలు పలికాడు రవిశాస్త్రి(Ravi Shastri News). మ్యాచ్​ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో తన భవిష్యత్తు వ్యూహాలేమిటో చెప్పుకొచ్చాడు. మళ్లీ కామెంట్రీ చెప్పనున్నట్లు హింట్ ఇచ్చాడు.

టీమ్​ఇండియా జట్టుకు హెడ్​ కోచ్ కావడానికి ముందు రవిశాస్త్రి వ్యాఖ్యాతగా చేశాడు. 2011లో టీమ్​ఇండియా ప్రపంచకప్​ గెలిచినప్పుడు కూడా కామెంట్రీ చేశాడు శాస్త్రి. 'ధోనీ ఫినిషెస్ ఆఫ్​ ఇన్​ స్టైల్. ఇండియా లిఫ్ట్​ ద వరల్డ్​ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్(తనదైన శైలిలో ధోనీ ఆటను ముగించాడు, టీమ్​ఇండియా 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ అందుకుంది)' అని శాస్త్రి చెప్పిన మాటలు క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.

ఆ తర్వాత కోచ్​ పదవి చేపట్టడం వల్ల కామెంట్రీకి దూరమయ్యాడు. ఇక ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన భారత్-ఇంగ్లాండ్ చివరి టెస్టు మ్యాచ్(IND vs ENG 5th test)​ వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇటీవలే పేర్కొంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ మ్యాచ్​తో రవిశాస్త్రి వ్యాఖ్యాతగా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి.

అత్యుత్తమ సేవలిందించా..

టీమ్​ఇండియా ప్రధాన కోచ్​గా అత్యుత్తమ సేవలందించేందుకు ప్రయత్నించానని రవిశాస్త్రి తెలిపాడు. టీమ్​ఇండియా విదేశాల్లో ఎన్నో విజయాలు సాధించిందని హర్షం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాను తమ సొంత గడ్డపైనే భారత్ ఓడించిందని, ఇంగ్లాండ్ సిరీస్​లోను అధిక్యంలో ఉందని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:

రోహిత్​కే టీ20 పగ్గాలు.. సిరీస్​కు కోహ్లీ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.