ETV Bharat / sports

'నేనే చివరి మహిళా కోచ్​ను కాకూడదు'

author img

By

Published : Nov 1, 2021, 6:11 AM IST

టీ10 లీగ్​ త్వరలోనే ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమ్​అబుదాబి అసిస్టెంట్ కోచ్ సారా టేలర్ పలు వ్యాఖ్యలు చేసింది. ఓ ఫ్రాంఛైజీకి తనే చివరి మహిళా కోచ్​గా మిగిలిపోకూడదని తెలిపింది.

sara taylor
సారా టేలర్

క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ పురుషుల జట్టుకు అసిస్టెంట్​ కోచ్​గా ఎంపికైన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సారా టేలర్ ఆ పదవిపై కీలక వ్యాఖ్యలు చేసింది. టీ10 లీగ్​ నేపథ్యంలో టీమ్​ అబుదాబికి అసిస్టెంట్ కోచ్​ బాధ్యతలు స్వీకరించిన సారా.. ఫ్రాంచైజీ క్రికెట్​కు సేవలందించే చివరి మహిళ తాను కాకూడదని పేర్కొంది.

"ఓ అడుగు ముందుకేశామని ఆశిస్తున్నా. మహిళలకు ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలి. ఇలాంటి బాధ్యతలు ఆడవారికి అప్పగించాలని భావిస్తున్నా. నన్ను కోచ్​లానే చూడాలి. మహిళా కోచ్​లా కాదు. ఈ పదవి దక్కడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఎప్పుడెప్పుడు అబుదాబికి వెళ్లాలా అని వేచి చూస్తున్నా. మంచి కోచ్​గా రాణిస్తా."

-సారా టేలర్, టీమ్​ అబుదాబి అసిస్టెంట్ కోచ్.

ప్రధాన కోచ్ పాల్ ఫార్​బ్రేస్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్​రౌండర్ లాన్స్ క్లుసెనర్​తో కలిసి టీమ్​అబుదాబికి సేవలందించనుంది సారా. ఇంగ్లీష్ కౌంటీ సస్సెక్స్​ కోసం స్పెషలిస్ట్​ కోచ్​గా పనిచేసి మంచి అనుభవం సంపాదించినట్లు తెలిపింది.

నవంబర్ 19 నుంచి అబుదాబి టీ10 లీగ్​ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:

T20 World Cup: భారత్ ఘోర పరాజయం.. సెమీస్​ ఆశలు గల్లంతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.