'బుమ్రా, హర్షల్ కాంబో.. డెత్ ఓవర్లలో ప్రత్యర్థికి చుక్కలే'

author img

By

Published : Nov 20, 2021, 6:02 PM IST

harshal patel

న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20(Ind vs NZ t20)లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ఇండియా బౌలర్ హర్షల్ పటేల్(harshal patel news)​పై ప్రశంసల వర్షం కురిపించారు టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప(robin uthappa news), కివీస్ మాజీ స్పిన్నర్ వెటోరి. డెత్ ఓవర్లలో బుమ్రాకు హర్షల్ తోడైతే భారత బౌలింగ్ దళం మరింత రాటుదేలుతుందని అభిప్రాయపడ్డారు.

న్యూజిలాండ్‌పై రెండో టీ20(Ind vs NZ t20) మ్యాచ్‌లో భారత్‌ జట్టు తరఫున అరంగేట్రం చేసిన హర్షల్‌ పటేల్‌(harshal patel news) ప్రదర్శనపై క్రికెటర్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. కివీస్‌ను కట్టడి చేయడంలో హర్షల్‌ (2/25) కీలక పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. డెత్‌ ఓవర్లలో అత్యంత ప్రభావవంతంగా బౌలింగ్‌ చేశాడు. హర్షల్‌(harshal patel news) బౌలింగ్‌ ప్రదర్శనపై స్పందించిన ఉతప్ప(robin uthappa news) అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు..

"బుమ్రాతో కలిసి హర్షల్‌(harshal patel news) డెత్‌ ఓవర్లలో (ఆఖరి ఐదు ఓవర్లు) ప్రమాదకరంగా మారతాడు. ఇది భారత టీ20 జట్టుకు ఎంతో బలం. ఒత్తిడి పరిస్థితుల్లోనూ బంతిని చక్కటి స్థానంలో సంధించే నైపుణ్యం హర్షల్ సొంతం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కివీస్‌తో మ్యాచ్‌లో తన రెండో ఓవర్‌ తొలి బంతికే ఫిలిప్స్‌ భారీ సిక్సర్‌ కొట్టాడు. రెండో బంతికి నోబాల్‌గా వేశాడు. అయితే అక్కడే హర్షల్‌ నైపుణ్యం బయటపడింది. అద్భుతంగా పుంజుకుని ఫ్రీహిట్ బంతిని డాట్‌ చేసి.. తర్వాతి బంతికే ఫిలిప్స్‌ను ఔట్‌ చేశాడు" అని వివరించాడు ఉతప్ప(robin uthappa news).

కివీస్‌ మాజీ కెప్టెన్‌ డానియల్‌ వెటోరి(daniel vettori news).. ఉతప్ప వ్యాఖ్యలను సమర్థించాడు. ఆఖరి ఓవర్లలో బుమ్రా బౌలింగ్‌కు హర్షల్‌ పటేల్‌(harshal patel news) జతకలిస్తే భారత టీ20 జట్టు భీకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ‘

"ఇప్పటికే డెత్‌ ఓవర్లలో బుమ్రా ప్రమాదకరమైన బౌలర్‌ అని తెలుసు. ఆఖరి ఓవర్లలో హర్షల్‌ పటేల్‌(harshal patel news) కూడా బౌలింగ్‌ చేసే నైపుణ్యం పెంచుకుంటే మాత్రం పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా జట్టు బలోపేతమవుతుంది. మరో కొత్త బౌలర్‌ ఆవేశ్ ఖాన్‌ పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్‌ చేయగలడు. ఎందుకంటే అతడు స్పెషలిస్ట్‌ బౌలర్‌గా టాప్‌ స్థానంలో ఉన్నాడు" అని వెటోరీ విశ్లేషించాడు. ఇతర జట్లలోనూ డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేసేందుకు ఎక్కువ మంది బౌలర్లు లేరని, అయితే భారత్‌కు కనీసం ఇద్దరు ఉండటం వల్ల టీ20ల్లో టీమ్‌ఇండియా భీకరమైన జట్టుగా మారుతుందని వెటోరి(daniel vettori news) అంచనా వేశాడు.

ఇవీ చూడండి: Syed Mushtaq Ali T20: ఫైనల్లో తమిళనాడు, కర్ణాటక.. హైదరాబాద్​కు నిరాశ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.