ETV Bharat / sports

Golden Ticket World Cup 2023 : సచిన్ తెందూల్కర్​​కు 'గోల్డెన్' టికెట్.. ఏంటి దీని ప్రత్యేకత?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 4:32 PM IST

Updated : Sep 8, 2023, 5:05 PM IST

Golden Ticket World Cup 2023 : 2023 ప్రపంచకప్​ భారత్​లో జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ.. గోల్డెన్ టికెట్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా శుక్రవారం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్​కు ఈ టికెట్​ను బీసీసీఐ సెక్రటరీ జై షా అందజేశారు.

Golden Ticket World Cup 2023
Golden Ticket World Cup 2023

Golden Ticket World Cup 2023 : టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)​కు 2023 ప్రపంచకప్​ గోల్డెన్ టికెట్ అందింది. ఈ టికెట్​ను బీసీసీఐ సెక్రటరీ జై షా.. శుక్రవారం స్వయంగా సచిన్​కు అందజేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. "ఇండియన్ ఐకాన్స్​కు గోల్డెన్ టికెట్స్​ కార్యక్రమంలో భాగంగా, బీసీసీఐ సెక్రటరీ జై షా.. భారతరత్న శ్రీ సచిన్ తెందూల్కర్​కు టికెట్ అందజేశారు. సచిన్ క్రికెట్ ప్రయాణం ఎన్నో తరాలలో స్పూర్తిని నింపింది. ఇప్పుడు ఆయన ఐసీసీ 2023 వరల్డ్​కప్ లైవ్ మ్యాచ్​లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు" అని ట్విట్టర్​లో రాసుకొచ్చింది. అయితే ఇదివరకే ఈ గోల్డెన్ టికెట్​ను బాలీవుడ్ బిగ్​ బి అమితాబ్​ బచ్చన్​కు కూడా అందజేసింది బీసీసీఐ.

  • 🏏🇮🇳 An iconic moment for cricket and the nation!

    As part of our "Golden Ticket for India Icons" programme, BCCI Honorary Secretary @JayShah presented the golden ticket to Bharat Ratna Shri @sachin_rt.

    A symbol of cricketing excellence and national pride, Sachin Tendulkar's… pic.twitter.com/qDdN3S1t9q

    — BCCI (@BCCI) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గోల్డెన్ టికెట్ అంటే ఏంటీ?
What Is Golden Ticket : భారత్ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని విజయవంతంగా నిర్వహించడం కోసం బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. గోల్డెన్ టికెట్ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న వారు, ప్రపంచకప్​లోని అన్ని మ్యాచ్​లను స్టేడియంలో ప్రత్యక్షంగా.. వీఐపీ బాక్స్​లో కూర్చొని వీక్షించవచ్చు. దీంతోపాటు ఈ టికెట్​పై వారికి వీఐపీ వసతులన్నింటినీ కల్పిస్తారు. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్​, సచిన్ తెందూల్కర్​ ఇద్దరికి ఈ టికెట్ అందింది. మున్ముందు ఈ గోల్డెన్ టికెట్లను దేశంలోని ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

  • Golden ticket for our golden icons!

    BCCI Honorary Secretary @JayShah had the privilege of presenting our golden ticket to none other than the "Superstar of the Millennium," Shri @SrBachchan.

    A legendary actor and a devoted cricket enthusiast, Shri Bachchan's unwavering support… pic.twitter.com/CKqKTsQG2F

    — BCCI (@BCCI) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరో 25 రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్​ కోసం.. బీసీసీఐ రీసెంట్​గా 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. గాయం కారణంగా గత ఆరు నెలల నుంచి ఆటకు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్​​కు జట్టులో చోటు దక్కింది.

Team India Squad For World Cup 2023 : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్​ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జన్​ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్​దీప్ యాదవ్.

ODI World Cup 2023 Hyderabad Schedule : ఉప్పల్‌ మ్యాచ్‌ రీ షెడ్యూల్‌ పై స్పందించిన బీసీసీఐ!

BCCI President Pakistan Visit : పాక్​కు BCCI బాస్​లు.. 'నో పాలిటిక్స్.. కేవలం క్రికెట్​ కోసమే​!'

Last Updated : Sep 8, 2023, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.