ETV Bharat / sports

'నడవలేని స్థితి వరకు ఐపీఎల్‌ ఆడతా- ఏ ఆటగాడైనా కోరుకునే గొప్ప అనుభూతి అదే!'

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 8:14 AM IST

Updated : Dec 7, 2023, 9:18 AM IST

Glenn Maxwell IPL 2024
Glenn Maxwell IPL 2024

Glenn Maxwell IPL 2024 : జీవితంలో నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్‌ ఆడతానని ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అన్నాడు. ఈ టోర్నీకో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. ఇంకా ఏమన్నాడంటే?

Glenn Maxwell IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్​- ఐపీఎల్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్. జీవితంలో నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్‌లో ఆడతానని అన్నాడు. ఆసీస్‌ వరల్డ్​ కప్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన 35 ఏళ్ల ఈ ప్లేయర్ ఐపీఎల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

'బహుశా నా క్రికెట్​ కెరీర్‌లో ఆడే చివరి టోర్నీ ఐపీఎల్‌ కావొచ్చు. నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్‌లో ఆడతాను. ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లీతో కలిసి భుజాలు కలపడం వారితో మాట్లాడుకుంటూ మిగతా వాళ్ల ఆట కూడా చూడటం ఏ ఆటగాడైనా కోరుకునే గొప్ప అనుభూతి. టీ20 వరల్డ్​ కప్‌నకు ముందు వీలైనంత ఎక్కువ మంది ఆసీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడతారని భావిస్తున్నాను' అని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు- ఆర్​సీబీ ప్లేయర్ మ్యాక్స్‌వెల్‌ తెలిపాడు. మరోవైపు వచ్చే ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు వెస్టిండీస్‌- అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.

Maxwell Stats In IPL : ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్​ కప్​ టోర్నీలో అద్భుతంగా రాణించాడు మ్యాక్స్​వెల్. ఇందులో ఒక డబుల్​ సెంచరీ కూడా నమోదు చేశాడు. అంతేకాకుండా ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 5 మ్యాచ్​ల టీ20 సిరీస్​లను అదరగొట్టాడు. ఐపీఎల్​లో ఆర్​సీబీ తరఫున ప్రాతినిధ్య వహిస్తున్న మ్యాక్స్​వెల్ ఆ జట్టులో మంచి ప్రదర్శన చేశాడు. 2021 ఐపీఎల్ సీజన్​లో 144 స్ట్రైక్ రేట్​తో 513 పరుగులు చేశాడు. ఇక గత ఐపీఎల్ ఎడిషన్​లో 183 స్ట్రైక్​ రేట్​తో 14 మ్యాచ్​ల్లో 400 పరుగులు సాధించాడు. దీంతో 2024 వేలానికి ముందు మ్యాక్​వెల్​ను రిటైన్​ చేసుకుంది ఆర్​సీబీ ఫ్రాంచైజీ. ప్యాట్​ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్వీవ్ స్మిత్, ట్రావిస్​ హెడ్​ వేలంలో తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇక ఐపీఎల్ 2024 మినీ (IPL Auction 2024) డిసెంబర్ 19న జరగనుంది.

బంగ్లా ప్లేయర్ వెరైటీ ఔట్ - బ్యాడ్​లక్​ అంటే అతడిదే!

తొలి టీ20 ఇంగ్లాండ్​దే - పోరాడి ఓడిన టీమ్ఇండియా

Last Updated :Dec 7, 2023, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.