ETV Bharat / sports

Ganguly on Sachin: టీమ్​ఇండియాకు సచిన్​ సేవలు.. గంగూలీ హింట్!

author img

By

Published : Dec 17, 2021, 1:25 PM IST

Ganguly on Sachin: టీమ్​ఇండియా హెడ్​ కోచ్​గా రాహుల్​ ద్రవిడ్​, ఎన్​సీఏ అధ్యక్షుడిగా వీవీఎస్​ లక్ష్మణ్​ ఎంపికైన అనంతరం భారత జట్టుకు సచిన్​ సేవలందిస్తాడన్న వార్తలు విస్తృతమయ్యాయి. ఆ రోజు ఎప్పుడొస్తుందా? అని అభిమానులు కూడా వేచిచూస్తున్నారు. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ ఏమన్నాడంటే..

sachin,ganguly
సచిన్, గంగూలీ

Ganguly on Sachin: దిగ్గజ క్రికెటర్, మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ తెందూల్కర్ టీమ్​ఇండియా జట్టులోకి తనదైన శైలిలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోసారి సచిన్ జట్టు కోసం సేవలందించేందుకు సిద్ధమవుతున్నట్లు క్రికెట్​ వర్గాలు చెబుతున్నాయి. భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ కూడా దీనిపై హింట్​ ఇవ్వడం గమనార్హం.

కొద్ది రోజుల క్రితమే టీమ్​ఇండియా హెడ్​ కోచ్​ బాధ్యతలను రాహుల్​ ద్రవిడ్​కు అప్పగించింది బీసీసీఐ. అనంతరం దిగ్గజ బ్యాటర్ వీవీఎస్​ లక్ష్మణ్​కు నేషనల్​ క్రికెట్ అకాడమీ(ఎన్​సీఏ) బాధ్యతలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సచిన్​ కూడా బ్యాక్​రూమ్​ స్టాఫ్​లో చేరనున్నాడన్న వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.

గంగూలీ హింట్..

ఇటీవలే 'బ్యాక్​ స్టేజ్ విత్ బోరియా' కార్యక్రమానికి హాజరైన గంగూలీ.. జట్టులో సచిన్​ ఎంట్రీ గురించి మాట్లాడాడు. 'సచిన్​ అందరికన్నా భిన్నంగా ఉంటాడు. ప్రస్తుతం టీమ్​కు సేవలందించే విషయంపై అతడికి ఆసక్తి లేదు. కానీ, ఏదో ఒక రోజు సచిన్​ కూడా జట్టుకు సేవలందించాల్సి వస్తుంది. ఉత్తమ నైపుణ్యం గలవారు జట్టులో ఉండటం ఎంతో అవసరం.' అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Ganguly vs Kohli:

టీమ్​ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టెస్టు జట్టు సారథి విరాట్​ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్​లో దుమారం రేపాయి. టీ20 జట్టు సారథిగా తప్పుకోవద్దన్నా విరాట్​ వినలేదని గతంలో గంగూలీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోహ్లీ మాట్లాడాడు. ఈ నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

కాగా, టీమ్​ఇండియా జట్టు మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ కోసం దక్షిణాఫ్రికా చేరుకుంది. తొలి టెస్టు డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. ఈ సిరీస్​ అనంతరం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్​ ఆడనుంది భారత్.

ఇదీ చదవండి:

Ganguly VS Kohli: కోహ్లీ వివాదంపై గంగూలీ ఏమన్నాడంటే?

IND vs SA 2021: దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన టీమ్​ఇండియా

కోహ్లీ​పై వార్నర్​ కంప్లైంట్.. ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.