ETV Bharat / sports

రాహుల్​కు గౌతీ వార్నింగ్​.. ఐపీఎల్​లో​ కెప్టెన్​గా ఉన్నంత మాత్రాన..!

author img

By

Published : Mar 23, 2022, 5:17 PM IST

ipl 2022
gambhir rahul

Gambhir KL Rahul: ఐపీఎల్ కొత్త ఫ్రాంఛైజీ లఖ్​నవూ జట్టు​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్న కేఎల్​ రాహుల్​కు టీమ్​ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్​ గంభీర్​ చురకలంటించాడు. ఐపీఎల్​లో జట్టుకు సారథిగా ఉన్నంత మాత్రాన.. టీమ్​ఇండియా కెప్టెన్​ అవుతామన్న గ్యారంటీ ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించాడు.

Gambhir KL Rahul: టీమ్​ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్​కు మాజీ దిగ్గజ ఆటగాడు గౌతమ్ గంభీర్ వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్​లో జట్టుకు సారథిగా ఉన్నంత మాత్రాన.. భారత క్రికెట్​ జట్టు కెప్టెన్సీకి గ్యారంటీ ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ గంభీర్​ చురకలంటించాడు. లఖ్​నవూ టీమ్​కు కావాల్సింది జట్టును నడిపించే బ్యాటర్ కానీ.. బ్యాటింగ్ చేసే కెప్టెన్ కాదని అన్నాడు. ఈ రెండింటి మధ్య తేడాను రాహుల్ అర్థం చేసుకుంటాడని భావిస్తున్నన్నాడు గంభీర్​. కాగా, లఖ్​నవూ జట్టుకు కేఎల్​ రాహుల్ కెప్టెన్​గా వ్యవహరిస్తుండగా.. గంభీర్ మెంటర్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

"సారథి అనేవాడు మైదానంలో కచ్చితంగా రిస్కు తీసుకోవాలి. కొన్ని సార్లు సరైన సమయంలో రిస్కు తీసుకోకపోతే విజయం సాధిస్తామో లేదో చెప్పలేం. ఇప్పుడు లఖ్​నవూ జట్టుకు కీపింగ్ కోసం క్వింటన్ డికాక్ ఉన్నాడు కాబట్టి.. ఇక కీపింగ్ బాధ్యతలు రాహుల్ పై ఉండబోవు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ బ్యాటింగ్​, నాయకత్వంపై దృష్టి పెట్టాలి. టీమ్​ఇండియా భవిష్యత్ కెప్టెన్ అనడానికి.. టీమ్​ఇండియా కెప్టెన్ అనడానికి మధ్య తేడా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తనను తాను నిరూపించుకోవడానికి ఐపీఎల్ చక్కటి వేదిక. కెప్టెన్​గా ఎదిగేందుకు ఈ మెగాటోర్నీ​ తోడ్పడుతుంది. అలాగని జాతీయ జట్టుకు కెప్టెన్ అవుతామన్న గ్యారంటీ మాత్రం ఉండదు."

  • గౌతమ్​ గంభీర్​, భారత మాజీ ఆటగాడు

జట్టు కూర్పు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పాడు గంభీర్​. "ఆల్ రౌండర్లు ఎక్కువగా ఉండేలా చూసుకున్నాం. వేలం సమయంలో ఇదే విషయాన్ని జట్టు యజమాని సంజీవ్ గోయెంకాకు చెప్పాను. నా మాటకు ఆయన ఎంతో విలువనిచ్చారు. నా మాటకు అంత గౌరవం ఇస్తారని నేను ఊహించలేదు. అందువల్లే జేసన్ హోల్డర్, దీపక్ హుడా వంటి ఆల్ రౌండర్లను జట్టులోకి తీసుకోగలిగాం" అని గంభీర్​ పేర్కొన్నాడు.

ఇదీ జరిగింది: స్టార్ క్రికెటర్​పై వేటు.. రెండు మ్యాచ్​ల నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.