ETV Bharat / sports

నాలుగు మార్పులతో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ రె'ఢీ'

author img

By

Published : Feb 12, 2021, 2:56 PM IST

భారత్​తో రెండో టెస్టుకు తమ జట్టులో నాలుగు మార్పులు చేసింది ఇంగ్లాండ్. జోఫ్రా ఆర్చర్​, జోస్​ బట్లర్​, డామ్​ బెస్​, అండర్సన్​ స్థానంలో బెన్​ ఫోక్స్​, స్టువర్ట్​ బ్రాడ్​, క్రిస్​ వోక్స్​, మొయిన్​ అలీకి చోటు కల్పించింది యాజమాన్యం.

Visitors make four changes, Anderson and Bess miss out
నాలుగు మార్పులతో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ రె'ఢీ'

భారత్​తో జరగబోయే రెండో టెస్టుకు నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది ఇంగ్లాండ్​ జట్టు. ఇప్పటికే బౌలర్​ జోఫ్రా ఆర్చర్​ మోచేతి గాయంతో ఆటకు దూరం కాగా.. జోస్​ బట్లర్​కు మిగిలిన మూడు టెస్టులకు విశ్రాంతినిచ్చింది టీమ్​ యాజమాన్యం. తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డామ్​ బెస్​, అండర్సన్​లనూ తుది జట్టు నుంచి తప్పించినట్లు కెప్టెన్ జో రూట్​ తెలిపాడు.

రెండో టెస్టుకు అందుబాటులో ఉండే తుది 12 మందిని ప్రకటించింది ఇంగ్లాండ్​ అండ్​ వేల్స్​ క్రికెట్​ బోర్డు. బెన్​ ఫోక్స్​, స్టువర్ట్​ బ్రాడ్​, క్రిస్​ వోక్స్​, మొయిన్​ అలీకి చోటు కల్పించింది. చివరి రెండు టెస్టులకు పూర్తి ఫిట్​గా ఉండాలనే ఉద్దేశంతో అండర్సన్​ను తప్పించినట్లు పేర్కొంది. ​తదుపరి మూడు టెస్టులకు ఫోక్స్​ వికెట్​కీపర్​గా ఆడతాడని కెప్టెన్​ రూట్​ తెలిపాడు. తుది రెండు మ్యాచ్​లకు జట్టులోకి వచ్చే జానీ బెయిర్​ స్టోను స్పెషలిస్టు బ్యాట్స్​మెన్​గా తీసుకుంటామని పేర్కొన్నాడు.

తొలి టెస్టుకు ముందు ఓపెనర్​ జాక్​ క్రావ్లీ గాయపడిన సంగతి తెలిసిందే. కాగా, మొదటి టెస్టులో 227 పరుగుల భారీ తేడాతో పర్యటక జట్టు విజయం సాధించింది. దీంతో టెస్టు ఛాంపియన్​షిప్​లో ఏకంగా 70.2 పాయింట్లతో మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది రూట్​ సేన. చెన్నై టెస్టు పరాభవంతో భారత్​ నాలుగో స్థానానికి పడిపోయింది.

రెండో టెస్టు చెన్నై వేదికగా ఫిబ్రవరి 13 నుంచి ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

ఇంగ్లాండ్​ స్క్వాడ్: డామ్​ సిబ్లీ, రోరీ బర్న్స్​, డాన్​ లారెన్స్​, జో రూట్​(కెప్టెన్​), బెన్​ స్టోక్స్​, ఒల్లీ పోప్​, బెన్​ ఫోక్స్​, మొయిన్ అలీ, స్టువర్ట్​ బ్రాడ్​, క్రిస్​ వోక్స్​, జాక్​ లీచ్​, ఒల్లీ స్టోన్​.

ఇదీ చదవండి: ఒలింపిక్​ నిర్వాహక కమిటీ అధ్యక్ష పదవికి మోరి రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.