ETV Bharat / sports

ఇచ్చిన మాట కోసం.. నాగిని డ్యాన్స్ వేసిన కైఫ్​!

author img

By

Published : Sep 8, 2021, 3:27 PM IST

Mohammad Kaif does naagin dance after he promises to do it if India wins the Oval Test
కైఫ్ నాగిని డ్యాన్స్.. ఆ మాట కోసం!

దిల్లీ క్యాపిటల్స్​ జట్టు అసిస్టెంట్​ కోచ్​, టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ మహ్మద్​ కైఫ్​ డ్యాన్సర్​గా అవతారమెత్తారు. నాగిని డ్యాన్స్​తో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇలా డ్యాన్స్​ వేయడానికి కారణమేంటో తెలుసా?

ఓవల్​ వేదికగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ మధ్య నాలుగో టెస్టు ఇటీవలే జరిగింది. ఈ మ్యాచ్​కు హిందీ కామెంటేటర్​గా భారత మాజీ క్రికెటర్​ మహ్మద్​ కైఫ్​ వ్యవహరిస్తున్నాడు. మ్యాచ్​ జరుగుతున్న మధ్యలో మాట్లాడుతూ.. టీమ్ఇండియా ఓవల్​ టెస్టు నెగ్గితే తాను కచ్చితంగా నాగిని డ్యాన్స్​ వేస్తానంటూ చెప్పుకొచ్చాడు.

ఆ టెస్టులో కోహ్లీసేన గెలుపొందింది. దీంతో కైఫ్​ చెప్పిన మాట ప్రకారం నాగిని డ్యాన్స్​ నేర్చుకొని కొన్ని స్టెప్పులు వేశాడు. దానికి సంబంధించిన గ్లింప్స్​ను దిల్లీ క్యాపిటల్స్​ జట్టు ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్స్​ చేస్తున్నారు.

దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి జరగనున్న ఐపీఎల్​లో రెండోదశ కోసం మహ్మద్​ కైఫ్​ దుబాయ్​ చేరుకున్నాడు. అక్కడ దిల్లీ క్యాపిటల్స్​ జట్టు ఏర్పాటు చేసిన క్యాంప్​లో మంగళవారం చేరాడు. మరికొన్ని రోజుల పాటు దుబాయ్​ హోటల్​ క్వారంటైన్​లో గడపనున్నాడు కైఫ్​.

ఇదీ చూడండి.. మైదానంలో రైనాను తిట్టిన ధోనీ.. కారణమేంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.