ETV Bharat / sports

IND VS ENG: తొలి రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ స్కోర్‌ 53/3

author img

By

Published : Sep 2, 2021, 11:22 PM IST

IND VS ENG 4th Test
టీమ్ఇండియా Vs ఇంగ్లాండ్​ నాలుగో టెస్టు

నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్​ జట్టు 53 పరుగులు చేసింది. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​ చేసిన టీమ్ఇండియా 191 పరుగులకే కుప్పకూలిపోయింది.

ఓవల్​ వేదికగా టీమ్​ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్​ జట్టు 53 పరుగులు చేసింది. అంతకుముందు భారత జట్టును 191 పరుగులకే ఆలౌట్​ చేసిన ఇంగ్లాండ్​.. ఆరంభంలోనే రెండు వికెట్లు సమర్పించుకుంది. ఓపెనర్లు రోరీ బర్న్స్​(5), హసీస్​ హమీద్​ డకౌట్​గా వెనుదిరిగారు. టీమ్​ఇండియా పేసర్​ జస్ప్రిత్​ బుమ్రా ఈ రెండు వికెట్లను పడగొట్టాడు. ఆ తర్వాత కెప్టెన్​ జో రూట్​(21) కూడా ఉమేశ్​ యాదవ్​ ఔట్​ చేశాడు. ప్రస్తుతం క్రీజులో క్రెయిగ్​ ఓవర్​టన్​(1), డేవిడ్​ మలన్​(26) ఉన్నారు.

నిరాశపర్చిన టాప్‌ఆర్డర్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. మ్యాచ్‌ ప్రారంభమైన గంటకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. తొలుత క్రిస్‌వోక్స్‌ రోహిత్‌ శర్మ(11)ను ఔట్‌ చేయగా తర్వాత రాబిన్‌సన్‌.. కేఎల్‌ రాహుల్‌(17)ను వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే అండర్సన్‌.. చెతేశ్వర్‌ పుజారా(4)ను సైతం పెవిలియన్‌ చేర్చి భారత్‌ను గట్టి దెబ్బతీశాడు. దాంతో టీమ్‌ఇండియా 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై కోహ్లీ, రవీంద్ర జడేజా(10) మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు.

దూకుడుగా ఆడిన శార్దూల్‌..

అయితే, భోజన విరామం తర్వాత మరింత చెలరేగిన ఇంగ్లాండ్‌ పేసర్లు ఈసారి జడేజా, కోహ్లీ, రహానెను పెవిలియన్‌ పంపారు. ఐదో ఆటగాడిగా బరిలోకి దిగిన జడేజా బాగా ఆడతాడనుకున్నా విఫలమయ్యాడు. వోక్స్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో రూట్‌ చేతికి చిక్కాడు. అనంతరం కోహ్లీ అర్ధశతకం పూర్తిచేసుకొని రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో కీపర్‌కు చిక్కాడు. దాంతో భారత్‌ 105 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం ఓవర్టన్‌ బౌలింగ్‌లో రహానె(14), వోక్స్‌ బౌలింగ్‌లో పంత్‌(9) కూడా విఫలమయ్యారు. ఇక మూడో సెషన్‌లో ధాటిగా ఆడిన శార్దూల్‌ ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఉమేశ్‌ యాదవ్‌(10)తో కలిసి ఎనిమిది వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. అయితే, జట్టు స్కోర్‌ 190 పరుగుల వద్ద అతడు క్రిస్‌వోక్స్‌ ఔలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో భారత్‌ తర్వాతి రెండు వికెట్లు మరుసటి ఓవర్‌లోనే కోల్పోయింది. రాబిన్‌సన్‌ వేసిన 62వ ఓవర్‌లో బుమ్రా(0), ఉమేశ్‌ ఔటవ్వడం వల్ల తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఇదీ చూడండి.. శార్దూల్​ ఠాకూర్ రికార్డు​.. కపిల్​దేవ్​ సరసన చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.