ETV Bharat / sports

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​.. ఆ ఇద్దరు స్టార్స్​ ఔట్​!

author img

By

Published : Sep 26, 2022, 9:33 PM IST

Updated : Sep 27, 2022, 8:36 AM IST

deepak hooda
దీపిక్ హూడా హార్దిక్ పాండ్య

దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​కు దీపక్ హోడా, హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండరని తెలిసింది.

దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని తెలిసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో వెన్నుముక గాయంతో ఇబ్బంది పడిన దీపక్​ హోడా.. ఈ సిరీస్​కు అందుబాటులో ఉంటాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అలాగే టీ20 ప్రపంచకప్​ నేపథ్యంలో ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యకు ఈ సిరీస్​కు విశ్రాంతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.

కాగా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు హోడా ఎంపికైనప్పటికీ.. వెన్ను నొప్పి కారణంగా కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే అతడు కొంతకాలంగా మంచి ఫామ్​లో ఉన్నాడు. ఏడాది జరిగిన ఐపీఎల్‌లో అదరగొట్టిన హుడా భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన జట్టులో హుడా సభ్యుడిగా ఉన్నాడు.

సఫారీతో టీ20 సిరీస్‌కూ షమి దూరం
కరోనా నుంచి ఇంకా కోలుకోని టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమి.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కూ దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో అతను స్టాండ్‌బైగా ఉన్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం షమిని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లకు ఎంపిక చేశారు. కానీ కరోనా సోకడంతో అతని స్థానంలో ఆసీస్‌పై ఉమేశ్‌ను ఆడించారు.

ఇప్పటికీ వైరస్‌ నుంచి షమి పూర్తిగా కోలుకోకపోవడంతో సఫారీ సేనతో టీ20లూ ఆడలేకపోతున్నాడు. ఈ సిరీస్‌కూ ఉమేశ్‌ జట్టులో కొనసాగనున్నాడు. మరోవైపు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న హార్దిక్‌ స్థానంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ జట్టులోకి రానున్నట్లు సమాచారం. వెన్ను నొప్పి కారణంగా దీపక్‌ హుడా కూడా దూరమవడంతో శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి రానున్నాడు.

"కరోనా నుంచి షమి కోలుకోలేదు. అతనికి మరింత సమయం కావాలి. అందుకే దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమయ్యాడు. హార్దిక్‌ను భర్తీ చేసే మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ లేడు. అందుకే షాబాజ్‌ జట్టులోకి వచ్చాడు" అని ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి చెప్పాడు. మరోవైపు ఇరానీ కప్‌లో సౌరాష్ట్రతో తలపడే రెస్టాఫ్‌ ఇండియా జట్టును హనుమ విహారి నడిపించనున్నాడు!

పూర్తి షెడ్యూల్‌

  • మొదటి టీ20: సెప్టెంబరు 28- బుధవారం- గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం- తిరువనంతపురం- కేరళ
  • రెండో టీ20: అక్టోబరు 2- ఆదివారం- బర్సపర క్రికెట్‌ స్టేడియం- గువాహటి- అసోం
  • మూడో టీ20: అక్టోబరు 4- మంగళవారం-హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియం- ఇండోర్‌- మధ్యప్రదేశ్‌

వన్డే సిరీస్‌

  • తొలి వన్డే: అక్టోబరు 6- గురువారం- భారత రత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్‌ స్టేడియం- లఖ్​నవూ- ఉత్తరప్రదేశ్‌
  • రెండో వన్డే: అక్టోబరు 9- ఆదివారం- జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్‌- రాంచి- ఝార్ఖండ్‌
  • మూడో వన్డే: అక్టోబరు 11- మంగళవారం- అరుణ్‌ జెట్లీ స్టేడియం- దిల్లీ

ఇదీ చూడండి: హాకీ స్టిక్​కు ఎక్స్​ట్రా ఛార్జ్​.. ఆ విమానయాన సంస్థపై ఒలింపిక్​ విన్నర్​ అసంతృప్తి

Last Updated :Sep 27, 2022, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.