ETV Bharat / sports

రైనా అరెస్ట్​ కావడానికి కారణం ఇదే!

author img

By

Published : Dec 22, 2020, 8:40 PM IST

భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా అరెస్టు పట్ల అతని మేనేజ్​మెంట్ టీమ్ వివరణ ఇచ్చింది. నిబంధనల గురించి అవగాహన లేకే రైనా.. అర్ధరాత్రి దాటాక పబ్​లో ఉన్నాడని వెల్లడించింది.

wasnt-aware-of-protocols-raina-on-being-booked-for-violating-covid-norms-in-mumbai
రూల్స్​ తెలియక రైనా అరెస్టు

ముంబయిలో కరోనా ఆంక్షల పట్ల భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనాకు అవగాహన లేదని అతడి మేనేజ్​మెంట్ టీమ్​ తెలిపింది. నిబంధనల గురించి తెలిసేలోపే అరెస్టు జరిగిపోయిందని వివరించింది.

"సురేశ్ రైనా ఓ షూటింగ్ కోసం ముంబయికి వెళ్లాడు. ఆ షూట్ లేటుగా ముగిసింది. తిరిగి దిల్లీ వెళ్లే సమయంలో ఒక స్నేహితుడు డిన్నర్ కోసం ఆ క్లబ్‌కు రావాలని రైనాను ఆహ్వానించాడు. అక్కడి టైమింగ్స్, కొత్త నిబంధనల గురించి రైనాకు తెలియదు. అతనెప్పుడూ ప్రభుత్వ నిబంధనలకు లోబడే వ్యవహరిస్తాడు. భవిష్యత్తులోనూ అలాగే ఉంటాడు."

-- సురేశ్ రైనా మేనేజ్​మెంట్ టీమ్

సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని ఎయిర్‌పోర్ట్ సమీపంలో డ్రాగన్‌ప్లై క్లబ్‌లో రైనా, సింగర్ గురు రంధవతో పాటు మొత్తం 34 మందిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు రాత్రి సమయాల్లో మున్సిపల్, కార్పొరేషన్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని గురించి తెలియని రైనా నిబంధనలను ఉల్లంఘించాడు. దీంతో అక్కడి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్​పై విడుదల చేశారు.

ఇదీ చూడండి: 'భజ్జీ ఔట్ చేశాడు.. టెక్నిక్​పై నమ్మకం పోయింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.