ETV Bharat / sports

అప్పుడు మైదానంలో..  ఇప్పుడు ట్విట్టర్​లో

author img

By

Published : Oct 20, 2019, 12:21 PM IST

Updated : Oct 20, 2019, 1:16 PM IST

బ్యాటింగ్​ చేసినంత సులభంగా ట్వీట్స్​ చేస్తూ, అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. అతడి పుట్టినరోజు సందర్భంగా వీరూ పంచింగ్ ట్వీట్స్​ను ఓసారి చూద్దాం.

ఏ బ్యాట్స్​మెన్​ అయినా క్రీజులో దిగగానే డిఫెన్స్ ఆడాలని చూస్తాడు. అయితే వచ్చి రాగానే బంతిని బౌండరీ దాటించాడంటే అర్థం చేసుకోవచ్చు.. అక్కడున్నది వీరేంద్ర సెహ్వాగ్​ అని.​ తన ఆటతో కోట్లాది మంది భారతీయులకు ఆరాధ్యుడిగా మారాడు. బ్యాట్‌తో బౌండరీ బాదినంత తేలిగ్గా ట్విటర్‌లో పంచులు విసురుతూ ఆ అభిమానాన్ని మరింత పెంచుకున్నాడు. వీరూ పుట్టినరోజు సందర్భంగా అతడి పంచింగ్‌ ట్వీట్లపై ప్రత్యేక కథనం.

virendra sehwag
టీమిండియా మాజీ క్రికెటర్ వీరంద్ర సెహ్వాగ్

ట్రిపుల్‌ సెంచరీలు చేసింది నేను కాదు.. నా బ్యాట్..!
'నేను రెండు ట్రిపుల్‌ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్‌ చేసింది'.. 'క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ గెలవలేదు. అయినా ఆ మెగాటోర్నీల్లో ఆడుతోంది'.. 'కబడ్డీ కనిపెట్టిన భారత్‌ ఎనిమిదోసారి ప్రపంచ ఛాంపియన్‌ అయింది. క్రికెట్‌ని కనిపెట్టిన దేశం, ఇంకా ఇతరుల తప్పులను వెతుకుతోంది'.. ఇవి వీరేంద్రుడు గతంలో చేసిన కొన్ని పంచ్‌ ట్వీట్లు.

2016 రియో ఒలింపిక్స్‌ సందర్భంగా భారత అథ్లెట్లు రెండు పతకాలే సాధించినా వారికి ఇక్కడ ఘన స్వాగతం పలికారు అభిమానులు. పీర్స్‌ మోర్గాన్‌ అనే ఇంగ్లిష్‌ జర్నలిస్టు ఆ ఫొటోలను పోస్టు చేస్తూ.. '1.2 బిలియన్ల జనాభా ఉన్న దేశం. రెండు పతకాలకే సంబరాలు చేసుకుంటుంది, సిగ్గుగా అనిపించడం లేదా?' అని ట్వీట్ చేశాడు. సెహ్వాగ్‌ అదే రీతిలో కౌంటర్‌ ఇచ్చాడు. 'చిన్నచిన్న విషయాలనే మేం పెద్దవిగా ఆస్వాదిస్తాం. కానీ, క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్‌ ఇంకా ప్రపంచకప్‌ గెలవాల్సి ఉంది. అయినా ప్రపంచకప్‌ ఈవెంట్లు ఆడుతోంది. సిగ్గుగా లేదా?' అని అప్పట్లో ప్రశ్నించాడు.

ట్విట్టర్​తో వినూత్నంగా ఆదాయం

virendra sehwag
టీమిండియా మాజీ క్రికెటర్ వీరంద్ర సెహ్వాగ్
'ఏదైనా అత్యుత్తమ నైపుణ్యం ఉంటే.. దాన్ని ఉచితంగా చేయకు' అనేది ఓ సామెత. టీమిండియా మాజీ ఓపెనర్‌కి ఇది సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అతడికున్న నైపుణ్యంతో సామాజిక మాధ్యమాల్లో ఏ బ్రాండ్‌కూ ప్రచారం చేయకుండా లక్షల్లో గడిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించాడీ మాజీ క్రికెటర్. 'ట్విటర్‌ ద్వారా సుమారు రూ.30లక్షల ఆదాయం సంపాదించా. అది కూడా ఆరు నెలల్లోనే' అని ఓ ట్వీట్‌లో చెప్పుకొచ్చాడు.

సెహ్వాగ్‌ సరదా ట్వీట్లు:

  • అశ్విన్‌ ఏడోసారి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గెలిచిన సందర్భంలో అతడికి అభినందనలు తెలుపుతూ 'త్వరగా ఇంటికి చేరుకోవాలనే విషయం వివాహితుడికి మాత్రమే అర్థం అవుతుంది' అని సరదాగా వ్యాఖ్యానించాడు.
  • క్రికెట్‌ లెజెండ్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ జన్మదినం సందర్భంగా మూడు వేర్వేరు ఫొటోలను జతచేశాడు. అందులో ఒకటి డాన్ ఫొటో‌, రెండోది బ్రెడ్‌, మూడోది ఒక వ్యక్తి. ఇలా మూడు ఫొటోలతో డాన్‌బ్రాడ్‌మన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
  • ప్రముఖ నటుడు వినోద్‌ ఖన్నా జన్మదినం సందర్భంగా ఈరోజు మనమంతా గన్నా(చెరుకు) జూస్‌ తాగి వినోద్‌ ఖన్నాకు శుభాకాంక్షలు తెలుపుదాం అన్నాడు.
  • ఓ సారి విరాట్‌ కోహ్లీని పొగుడుతూ 'హజ్మేకి గోలీ, రంగోంకి హోలి, బ్యాటింగ్‌ మె కోహ్లీ.. యావత్‌ భారత్‌ ఇష్టపడుతుందని' ట్వీట్‌ చేశాడు.
  • ఈ రోజుల్లో కళ్లు మూసుకున్నా, టెన్షన్‌ లేకున్నా నిద్రరాదు. వైఫై బంద్‌ చేస్తేనే నిద్రవస్తుందని జోక్‌ పేల్చాడు.
  • ప్రముఖ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ను కొనియాడుతూ 'ఆమె పేరు సెరెనా, అయినా టైటిల్స్‌ గెలవడంలో 'నా' చెప్పదు. గెలుస్తూనే ఉంటుందని ట్వీట్ చేశాడు
    virendra sehwag
    టీమిండియా మాజీ క్రికెటర్ వీరంద్ర సెహ్వాగ్
RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Minute Maid Park, Houston, Texas, USA. 19th October 2019.
1. 00:00 Astros pitcher Brad Peacock
Bottom of the 1st inning:
2. 00:05 Yuli Gurriel 3-run home run for Astros and 3-0
Top of the 2nd inning:
3. 00:42 Gary Sanchez single for Yankees to trail 3-1
Top of the 4th inning:
4. 00:55 Gio Urshela home run for Yankees to trail 3-2
Bottom of the 6th inning:
5. 01:26 Fielder's choice, run scores for Astros and 4-2
Top of the 7th inning:
6. 01:39 Michael Bradley diving catch for Astros, throws out runner at 1st base for double play
Top of the 9th inning:
7. 02:03 D.J. LeMahieu 2-run home run for Yankees to level 4-4
Bottom of the 9th inning:
8. 02:36 Jose Altuve 2-run home run for Astros to win game and series
SCORE: Houston Astros 6, New York Yankees 4 (Astros win ALCS 4-2)
SOURCE: MLB
DURATION: 03:30
STORYLINE:
Jose Altuve hit a two-out, two-run home run in the bottom of the ninth inning, as the Houston Astros earned a trip to the World Series, with an ALCS-clinching 6-4 win over the New York Yankees Saturday night in Houston.
Last Updated :Oct 20, 2019, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.