ETV Bharat / sports

ప్రాక్టీస్​ సెషన్​లో కోహ్లీ హెలికాఫ్టర్​ షాట్​

author img

By

Published : Feb 3, 2021, 8:18 PM IST

ఇంగ్లాండ్​తో జరగబోయే సిరీస్​ కోసం నెట్​ ప్రాక్టీస్​ చేస్తుంది టీమ్​ఇండియా. ఈ క్రమంలోనే సారథి కోహ్లీ.. మాజీ కెప్టెన్​ ధోనీ హెలికాఫ్టర్​ షాట్​ను సైగలతో అనుకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్​ చేసింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

kohli
కోహ్లీ

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ హెలికాఫ్టర్​ షాట్.. ​ప్రతి అభిమానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఈ షాట్​ను సైగలతో అనుకరించాడు సారథి కోహ్లీ. ప్రస్తుతం టీమ్ఇండియా.. ఫ్రిబవరి 5నుంచి ఇంగ్లాండ్​తో ప్రారంభంకానున్న టెస్టు సిరీస్​ కోసం నెట్​ ప్రాక్టీస్ చేస్తుంది. ఇందులో భాగంగా బుధవారం జరిగిన ప్రాక్టీస్​ సెషన్​కు సంబంధించిన వీడియోను పోస్ట్​ చేసింది బీసీసీఐ. ఇందులో భారత ఆటగాళ్లు జోరుగా, ఉత్సాహంగా శిక్షణ చేస్తూ కనిపించారు. ఈ క్రమంలోనే కోహ్లీ.. మహీని గుర్తుకుతెస్తూ హెలికాఫ్ట్​ర్​ షాట్​ను సైగలతో అనుకరించాడు. ఈ వీడియో వైరల్​ అవ్వగా.. నెటిజన్లు విపరీతంగా లైక్స్​ కొడుతూ కామెంట్లు పెడుతున్నారు.

షెడ్యూల్​

ప్రస్తుతం భారత్​ పర్యటనలో భాగంగా చెన్నైలో ఉంది ఇంగ్లాండ్​. ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టులు చెన్నైలో, మూడు(డేనైట్), నాలుగో మ్యాచ్​కు అహ్మదాబాద్ (మెతేరా స్టేడియం) వేదిక కానుంది.

ఇదీచూడండి : పరీక్ష ముగిసింది.. ప్రాక్టీస్ మొదలైంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.