ETV Bharat / sports

'కోహ్లీ ప్రయత్నం చేశాడు.. అదృష్టం కలిసిరాలేదు'

author img

By

Published : Mar 5, 2020, 10:30 AM IST

కివీస్​ పర్యటనలో ఘెరంగా విఫలమైన కోహ్లీపై మాజీలు విమర్శలు కురిపిస్తుండగా, సెహ్వాగ్​ మాత్రం అండగా నిలిచాడు. విరాట్​కు అదృష్టం కలిసి రాలేదని అన్నాడు.

'కోహ్లీ ప్రయత్నం చేశాడు.. అదృష్టం కలిసిరాలేదు'
విరాట్ కోహ్లీ

న్యూజిలాండ్​ పర్యటనలో టీమిండియా నిరాశపర్చింది. కెప్టెన్​ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో అతడికి మద్ధతుగా నిలిచాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.

virender sehwag
భారత మాజీ క్రికెటర్ వీరంద్ర సెహ్వాగ్

'క్రికెట్ కెరీర్​లో అందరూ సంధి దశ ఎదుర్కొన్నవారే. అప్పట్లో సచిన్, లారా.. ఇప్పుడు స్టీవ్ స్మిత్​లకు ఫామ్​లేమి బాధ తప్పట్లేదు. ఒకానొక సమయంలో నేనూ ఈ సమస్యను ఎదుర్కొన్నా. అయినా సహజసిద్ధమైన ఆటను వదులుకోలేదు. మళ్లీ ఫామ్​ అందుకోవాలంటే కాస్త సహనం అవసరం. కోహ్లీ తప్పుకుండా తిరిగి జోరందుకుంటాడు. కివీస్​తో సిరీస్​ల్లో అతడు బ్యాటింగ్​లో, కెప్టెన్సీలో ప్రయత్నాలు చేశాడు. కానీ అదృష్టం కలిసిరాలేదు' -వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్

ఈ పర్యటనలో మొత్తంగా 11 ఇన్నింగ్స్​లు ఆడిన కోహ్లీ.. కేవలం ఒక్క అర్ధ శతకం మాత్రమే చేశాడు. ఇతడి బ్యాటింగ్​ వైఫల్యం, భారత్​ ఓడిపోవడానికి ఓ కారణమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీ20 సిరీస్​ను 5-0 తేడాతో గెల్చుకున్న టీమిండియా.. వన్డేలను 0-3, టెస్టులను 0-2 తేడాతో కోల్పోయింది.

కోహ్లీ చివరగా గతేడాది జరిగిన బంగ్లాదేశ్​తో డే/నైట్​ టెస్టులో శతకం చేశాడు. అప్పటి నుంచి ఒక్క సెంచరీ చేయలేకపోయాడు. రానున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్, ఐపీఎల్​లోనూ ఇలానే ఆడితే కష్టమే.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.