ETV Bharat / sports

భారత్ చేతిలో ఇంగ్లాండ్​ వైట్​వాషే: వాన్

author img

By

Published : Mar 23, 2021, 11:49 AM IST

ఇంగ్లాండ్​తో జరగనున్న వన్డే సిరీస్​ను టీమ్ఇండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైఖెల్ వాన్. రూట్, ఆర్చర్ లేకపోవడం పెద్ద లోటని వెల్లడించాడు.

India
టీమ్ఇండియా

ఇంగ్లాండ్​తో టెస్టు, టీ20 సిరీస్​లను గెలిచిన టీమ్ఇండియా వన్డేల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ సిరీస్​లో భాగంగా మొదటి వన్డే నేడు పుణె వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో స్పందించిన ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైఖెల్ వాన్.. భారత జట్టు ఈ సిరీస్​ను 3-0 తేడాతో కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు.

"నా ముందస్తు అంచనా ప్రకారం భారత్ ఈ సిరీస్​ను 3-0 తేడాతో గెలుస్తుంది. రూట్, ఆర్చర్ లేకపోవడం పెద్ద లోటు" అంటూ ట్వీట్ చేశాడు వాన్.

  • Early One day series prediction .... India will win 3-0 !!! No Root or Archer ... #INDvENG

    — Michael Vaughan (@MichaelVaughan) March 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టీమ్ఇండియాతో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రూట్​కు చోటు దక్కలేదు. అలాగే స్టార్ పేసర్ ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లేకుండానే బరిలో దిగుతోంది.

ఇంగ్లాండ్ జట్టు

ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్​స్టో, సామ్ బిల్లింగ్స్, జాస్ బట్లర్, సామ్ కరన్, టామ్ కరన్, లివింగ్​స్టోన్, మాట్ పర్కిన్​సన్, అదిల్ రషీద్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్స, రీస్ టాప్లే, మార్క్ వుడ్

రిజర్వ్ ఆటగాళ్లు

జాక్ బాల్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ మలన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.