ETV Bharat / sports

'అక్తర్​ వేసిన బౌన్సర్లకు సచిన్​ భయపడ్డాడు'

author img

By

Published : May 27, 2020, 3:21 PM IST

షోయబ్​ అక్తర్​ వేసిన బౌన్సర్లకు బ్యాటింగ్​ దిగ్గజం సచిన్​ ఇబ్బంది పడ్డాడని అన్నాడు పాకిస్థాన్​ మాజీ బౌలర్​ మహ్మద్​ ఆసిఫ్​. 2006లో పాకిస్థాన్​పై టెస్టు సిరీస్​ ఆడటానికి వచ్చినప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడీ పేసర్​.

Tendulkar closed eyes while facing Akhtar's bouncers: Mohd Asif
'అక్తర్​ వేసిన బౌన్స్​లకు సచిన్​ భయపడ్డాడు'

పాకిస్థాన్​ మాజీ బౌలర్​ షోయబ్​ అక్తర్​ వేసిన బౌన్సర్లకు క్రికెట్​ లెజెండ్​ సచిన్​ తెందూల్కర్​ ఇబ్బంది పడ్డాడని ఆ దేశ మాజీ పేసర్​ మహ్మద్​ ఆసిఫ్​ అన్నాడు. 2006లో పాకిస్థాన్​ పర్యటనకు వచ్చిన భారత్​ సిరీస్​ను గుర్తుచేసుకున్నాడీ బౌలర్​. ఈ సిరీస్​లో ఇర్ఫాన్​ పఠాన్​ హ్యాట్రిక్​ వికెట్లతో అదరగొట్టాడు.

మహ్మద్​ ఆసిఫ్​.. స్పాట్​ ఫిక్సింగ్​ కారణంగా గతంలో ఏడేళ్ల పాటు సస్పెన్షన్ అనుభవించాడు.

"2006లో పాకిస్థాన్​కు వచ్చిన భారత జట్టు మంచి బ్యాటింగ్​ లైనప్​తో వచ్చింది. ధోనీ ఏడో, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. ఫైసలాబాద్​ టెస్టులో ఇరు జట్లు 600 పరుగులు చేశాయి. ద్రవిడ్​, సెహ్వాగ్​ దూకుడుగా ఆడారు. భారత జట్టును చూసి మేము కొంత భయపడ్డాం. ఇర్ఫాన్​ పఠాన్​ మొదటి ఓవర్లనే హ్యాట్రిక్ సాధించాడు. క్రమంగా మాలో ధైర్యం కోల్పోతున్నాం. మేము సుమారు 240 పరుగులు చేసి.. బౌలింగ్​ ప్రారంభించగా అక్తర్​ ఎక్స్​ప్రెస్​ వేగంతో బౌలింగ్​ చేశాడు. అప్పుడు క్రీజ్​లో ఉన్న సచిన్​ భయంతో రెండు సార్లు కళ్లు మూసుకున్నాడు".

- మహ్మద్​ ఆసిఫ్​, పాకిస్థాన్​ మాజీ పేసర్​ ​

తొలి ఇన్నింగ్స్​లోని మొదటి ఓవర్లలో సల్మాన్​ భట్​, యూనిస్​ ఖాన్​, మహ్మద్​ యూసఫ్​లను కోల్పోయినప్పటికీ.. కమ్రాన్​ అక్మల్​ చేసిన శతకంతో పాక్​ 245 పరుగులకు చేరింది. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్​ 238 పరుగులకే కుప్పకూలిపోయింది.

రెండవ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 599 పరుగులు సాధించింది. ఇక్బాల్​ సెంచరీతో పాటు మహ్మద్​ యూసఫ్​ సహకారంతో ఆ మ్యాచ్​లో పూర్తి నియంత్రణ సాధించింది. బౌలింగ్​లో రజాక్​, ఆసిఫ్​ భారత బ్యాటింగ్​ లైనప్​ను ఛేదించి సిరీస్​ను కైవసం చేసుకుంది పాక్. యువరాజ్​ చేసిన సెంచరీ వృథా అయ్యింది.

ఇదీ చూడండి... 'ఐపీఎల్​ ఆడాలా వద్దా? అనేది వాళ్ల ఇష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.