ETV Bharat / sports

'టీమ్​ఇండియాలో చోటు.. అస్సలు నమ్మలేకపోతున్నా'​

author img

By

Published : Mar 19, 2021, 6:02 PM IST

Updated : Mar 19, 2021, 6:08 PM IST

టీమ్​ఇండియాలో చోటు దక్కడంపై యువ పేసర్​ ప్రసిద్ధ్​ క్రిష్ణ ఆనందం వ్యక్తం చేశాడు. జట్టులో స్థానం పొందడం నమ్మశక్యంగా లేదని పేర్కొన్నాడు. తొలి మ్యాచ్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు.

Surreal feeling, can't wait to get started: Prasidh Krishna after maiden India call-up
టీమ్​ఇండియాలో చోటు!.. నమ్మశక్యంగా లేదు: ప్రసిద్ధ్​

ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​ కోసం భారత వన్డే జట్టును శుక్రవారం ప్రకటించారు. అయితే జట్టులో తనకు చోటు దక్కడంపై యువ పేసర్ ప్రసిద్ధ్​ క్రిష్ణ స్పందించాడు. టీమ్​ఇండియాకు ఎంపిక కావడాన్ని అస్సలు నమ్మలేకపోతున్నానని చెప్పాడు. అరంగేట్ర మ్యాచ్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు.

  • Feels surreal when you get the call to play for your country🇮🇳
    It's like a dream come true. Excited to play my part and contribute to the success of the team.
    Thanks @BCCI. Can't wait to get started. 😊 https://t.co/IQ63JQDBXb

    — Prasidh Krishna (@prasidh43) March 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జాతీయ జట్టులో స్థానం దక్కిందనే భావన నమ్మశక్యంగా లేదు. నా కల నెరవెరబోతోంది. టీమ్​ఇండియా విజయానికి నా వంతు కృషి చేస్తాను. బీసీసీఐకి ధన్యవాదాలు. తొలి మ్యాచ్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను"

-ప్రసిద్ధ్ క్రిష్ణ, యువపేసర్

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ తరఫున ఆడుతున్నాడు ప్రసిద్ధ్. ఇప్పటివరకు ఆరు మ్యాచ్​లు ఆడిన క్రిష్ణ.. 9.37 ఎకానమీతో నాలుగు వికెట్లు తీశాడు.

భారత జట్టు..

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్.

ఇదీ చదవండి: ఒలింపిక్స్​కు మరో నలుగురు భారత అథ్లెట్లు

Last Updated : Mar 19, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.