ETV Bharat / sports

ఆరుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు కరోనా నెగిటివ్​

author img

By

Published : Jun 30, 2020, 2:32 PM IST

కరోనా బారిన పడిన పది మంది పాకిస్థాన్ ఆటగాళ్లలో ఆరుగురికి తాజాగా చేసిన పరీక్షల్లో నెగటివ్​గా నిర్ధరణ అయ్యినట్లు ఆ దేశ క్రికెట్​ బోర్డు ప్రకటించింది. కోలుకున్న వారిని తిరిగి ఇంగ్లాండ్​ పర్యటనకు పంపిస్తామని తెలిపింది.

Six Pak players, including Hafeez, test negative for COVID-19; to join squad in England
ఆ ఆరుగురు పాకిస్థాన్​ క్రికెటర్లలో వైరస్​ లేదు!

గతవారం కరోనా బారిన పడిన ఆరుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు మరోసారి పరీక్ష చేయగా వారికి నెగటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఇంగ్లాండ్​ పర్యటన కోసం శుక్రవారం పాక్​ ఆటగాళ్లకు కరోనా టెస్టులు చేయగా.. వారిలో పది మందికి వైరస్​ సోకినట్లు తేలింది. అయితే తాజాగా జరిపిన కరోనా నిర్ధరణ పరీక్షలో ఫఖర్​ జమాన్​, మహ్మద్​ హస్మైన్​, మహ్మద్​ హఫీజ్​, మహ్మద్​ రిజ్వాన్​, షాదాబ్​ ఖాన్​, వాహబ్​ రియాజ్​లకు నెగటివ్​గా వచ్చినట్లు పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ప్రకటించింది.

"జూన్​ 26న క్రికెటర్లకు చేసిన కరోనా పరీక్షల తర్వాత.. జూన్​ 29 (సోమవారం)న మరోసారి వారికి కొవిడ్​ టెస్టు చేయగా అందులో నెగటివ్​గా తేలింది" అని మంగళవారం ప్రకటన చేసింది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు. శుక్రవారం క్రికెటర్లకు కరోనా పరీక్షలు చేయించి.. అందులో వైరస్​ సోకిన వారి పేర్లను ప్రకటించింది. వారిలో క్రికెటర్​ హఫీజ్​ తనను తాను పరీక్షించుకోవడానికి ఓ ప్రైవేట్​ ఆస్పత్రిని ఆశ్రయించగా.. అందులో వైరస్​ సోకలేదని తేలింది. దీంతో షాక్​కు గురైనా పీసీబీ.. క్రికెటర్లందరికీ మరోసారి కరోనా పరీక్షలు చేయించింది.

వైరస్​ పరీక్షలో నెగటివ్​గా తేలిన ఆరుగురు ఆటగాళ్లు ఇంగ్లాండ్​తో జరిగే సిరీస్​లో పాల్గొనడానికి అర్హులని పీసీబీ ప్రకటించింది. వారు ఇంగ్లాండ్​ వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేసి.. వెళ్లే సమయాన్ని త్వరలోనే తెలియజేస్తామని అధికారులు తెలిపారు. ఇంగ్లాండ్​, పాకిస్థాన్​ల మధ్య ఆగస్టు మొదటి వారం నుంచి మూడు టెస్టులు, మూడు టీ20లు ప్రారంభం కానున్నాయి.

ఇదీ చూడండి... నేను కూరగాయలు అమ్మట్లేదు: జావేద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.