ETV Bharat / sports

వికెట్ పడిన ప్రతిసారీ ఎగిరి గంతులేశాం: సచిన్

author img

By

Published : Jun 26, 2020, 11:42 AM IST

1983లో దిగ్గజ వెస్టిండీస్​తో తలపడి.. భారత క్రికెట్​ జట్టు సాధించిన ప్రపంచ కప్​కు గురువారం నాటికి 37 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా సచిన్​ తెందుల్కర్​ ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ.. సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఆ ఫైనల్​ మ్యాచ్​ కీలక ఘట్టమని ట్వీట్టర్​ వేదికగా తెలిపారు.

SACHIN TENDULKAR
సచిన్​ తెందుల్కర్​

1983 ప్రపంచకప్‌ ఫైనల్‌ జరిగి గురువారానికి 37 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందుల్కర్ నాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నాడు. ఆ ఫైనల్లో కపిల్‌డెవిల్స్‌ దిగ్గజ వెస్టిండీస్‌ను 43 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆనాటి ఆటగాళ్లతో పాటు లిటిల్‌ మాస్టర్‌ తన సంతోషాన్ని పంచుకున్నాడు. 1983 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చాలా మంది లాగే తన జీవితంలోనూ కీలక ఘట్టమని ట్వీట్‌ చేశాడు.

  • The #WorldCup1983 Final like for many was a landmark event in my life.

    Still recall my friends & I celebrating all wickets right from BS Sandhu's epic delivery to Greenidge to Kapil Paaji’s catch. We jumped & celebrated the fall of each wicket! What an evening it was.🙂 pic.twitter.com/1WJH4sXjRB

    — Sachin Tendulkar (@sachin_rt) June 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆ రోజు టీమ్‌ఇండియా బౌలర్లు విండీస్‌ ఆటగాళ్ల వికెట్లు తీయడం నేను, నా స్నేహితులు ఎంతో ఆస్వాదించాం. గార్డన్‌ గ్రీనిడ్జ్‌(1) వికెట్‌ తీసిన సంధూ.. కపిల్‌దేవ్‌ అందుకున్న అద్భుత క్యాచ్‌ వరకు అన్నీ చూశాం. ప్రతివికెట్‌కూ మేం ఎగురుతూ ఆనందించాం. అది ఎంతో సంతోషకరమై సాయంత్రం"

సచిన్‌ తెందూల్కర్​, భారత మాజీ క్రికెటర్​

అప్పటి విజయాన్ని ఆ జట్టు సభ్యులు కపిల్‌దేవ్‌, రవిశాస్త్రి కూడా గుర్తుచేసుకున్నారు. అలాగే మహ్మద్‌ కైఫ్‌, యువరాజ్‌సింగ్‌, హర్భజన్‌ లాంటి ఆటగాళ్లూ ట్విటర్‌లో నాటి జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 54.4 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలౌట్​ అయ్యింది. కృష్ణమాచారి శ్రీకాంత్‌ 38, మోహిందర్‌ అమర్‌నాథ్‌(26), సందీప్‌ పాటిల్‌(27) పరుగులు చేశారు. అనంతరం భారత బౌలర్లు చెలరేగడంతో విండీస్‌ 140 పరుగులకే కుప్పకూలింది. మదన్‌లాల్‌, మోహిందర్‌ చెరో మూడు వికెట్లు తీశారు. బల్విందర్‌ సంధు రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్‌ 43 పరుగులతో మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించి విజయం సాధించింది.

ఇదీచూడండి:'టీ20 ప్రపంచకప్​ను ఐపీఎల్​తో భర్తీ చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.