ETV Bharat / sports

భార్యా, బ్యాటింగ్ పార్ట్​నర్ ఎవర్ని నమ్ముతారు!

author img

By

Published : May 19, 2020, 12:19 PM IST

టీమ్​ఇండియా క్రికెటర్ పుజారా తాజాగా ఓ ఫొటో షేర్ చేశాడు. తన సతీమణి హెయిర్​కట్ చేస్తోన్న చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దీనికి ఓ ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

పుజారా
పుజారా

లాక్​డౌన్ సమయంలో ఇంటివద్దే ఉంటున్నారు క్రికెటర్లు. కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో అభిమానులతో టచ్​లో ఉంటున్నారు. అయితే తాజాగా టీమ్​ఇండియా నయావాల్ పుజారా ఓ ఫొటోను నెట్టింట షేర్ చేశాడు. దీనికి ఓ ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

లాక్​డౌన్ వల్ల సెలూన్​లు తెరచుకోలేదు. అందువల్ల పుజారాకు తన సతీమణి హెయిర్​కట్ చేసింది. ఈ ఫొటోను నెట్టింట షేర్ చేస్తూ.. "99 పరుగుల వద్ద సింగిల్​ కోసం మీ బ్యాటింగ్ పార్ట్​నర్​ను నమ్ముతారా.. లేక మీ హెయిర్​కట్ కోసం భార్యను నమ్ముతారా" అంటూ రాసుకొచ్చాడు.

అయితే ఈ ఫొటోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఇలాంటి క్యాప్షన్ పెట్టాలంటే ధైర్యం ఉండాలంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.