ETV Bharat / sports

తొలి టెస్టులో విండీస్​పై కివీస్ ఘనవిజయం

author img

By

Published : Dec 6, 2020, 11:33 AM IST

వెస్టిండీస్​తో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది న్యూజిలాండ్. ఇన్నింగ్స్ 134 పరుగుల తేడాతో గెలిచి సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కివీస్ సారథి విలియమ్సన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.

New Zealand beat West Indies by an innings and 134 runs in first Test
తొలి టెస్టులో విండీస్​పై కివీస్ ఘనవిజయం

వెస్టిండీస్​తో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయాన్ని కైవసం చేసుకుంది న్యూజిలాండ్. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ తొలి ఇన్నింగ్స్​లో 7 వికెట్ల నష్టానికి 519 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్ లాథమ్ 86 పరుగులతో రాణించగా, సారథి విలియమ్సన్ (251) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. చివర్లో జేమిసన్ 51 పరుగులతో నిలవగా, కివీస్ 519 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. విండీస్ బౌలర్లలో రోచ్ 3, గేబ్రియల్ 3, అల్జారీ జోసెఫ్ 1 వికట్ దక్కించుకున్నారు.

New Zealand beat West Indies by an innings and 134 runs in first Test
విలియమ్సన్

అనంతరం బ్యాటింగ్​కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్​లో 138 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు బ్రాత్​వైట్ (21), క్యాంప్​బెల్ (26) కుదురుకుంటున్న సమయంలో ఈ జోడీ పెవిలియన్ చేరింది. తర్వాత ఎవరూ ఆకట్టుకోకపోవడం వల్ల తక్కువ స్కోర్​కే పరిమితమైంది విండీస్.

ఫాలోఆన్

తర్వాత ఫాలో ఆన్​ ఆడిన విండీస్ రెండో ఇన్నింగ్స్​లోనూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మిడిలార్డర్ బ్యాట్స్​మన్ బ్లాక్​వుడ్ (104) కెరీర్​లో రెండో టెస్టు సెంచరీకి తోడు, అల్జారీ జోసెఫ్ 86 పరుగులతో రాణించినా మిగతా బ్యాట్స్​మెన్ విఫలమవడం వల్ల 247 పరుగులకే ఆలౌటై 134 పరుగుల తేడాతో కివీస్ చేతిలో పరాజయంపాలైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.