ETV Bharat / sports

మొయిన్​ అలీకి నెగెటివ్​.. తిరిగి జట్టులోకి

author img

By

Published : Jan 17, 2021, 8:49 AM IST

కరోనా(యూకే స్ట్రెయిన్​) బారిన పడిన ఇంగ్లాండ్​ క్రికెటర్​ మొయిన్ అలీకి తాజాగా చేసిన వైరస్​ నిర్ధరణ పరీక్షల్లో నెగెటివ్​ వచ్చింది. దీంతో అతడు తిరిగి.. శ్రీలంక పర్యటనలో ఉన్న తమ జట్టులో చేరాడు.

moein
మోయిన్​ అలీ

శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ మొయిన్​ అలీ.. కరోనా(యూకే స్ట్రెయిన్​) బారి నుంచి కోలుకున్నాడు. 13 రోజుల పాటు క్వారంటైన్​లో ఉన్న అతడు.. తిరిగి బయోబుబుల్​ వాతావరణంలో ఉన్న తమ జట్టులో చేరాడు.

శ్రీలంక-ఇంగ్లాండ్​ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరుగుతోంది. జనవరి 14న తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్​లో 135 పరుగులకు ఆలౌట్​ అవ్వగా.. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 421 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్​లో లంక నిలకడగా ఆడుతోంది.

ఇదీ చూడండి : ఇంగ్లాండ్​ క్రికెటర్​కు స్ట్రెయిన్ వైరస్​​​.. మ్యాచ్​ యథాతధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.