ETV Bharat / sports

'వివాహానికి దేశం కాదు.. ప్రేమ ముఖ్యం'

author img

By

Published : Jun 23, 2020, 11:18 AM IST

Love matters in marriage, not the country where your partner comes from: Shoaib Malik on wife Sania Mirza
'వివాహానికి దేశం కాదు.. ప్రేమ ముఖ్యం'

సానియా మీర్జాతో వివాహం గురించి పాక్​ క్రికెటర్ షోయబ్​ మాలిక్​ స్పందించాడు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రేమకు ఎప్పుడూ అడ్డురావని అన్నాడు. తానేమీ రాజకీయ నాయకుడ్ని కాదని.. ఒక క్రికెకటర్​ అని తెలిపాడు.

2010లో జరిగిన ప్రముఖ టెన్నిస్​ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్​ షోయబ్​​ మాలిక్​ల వివాహం ఇరుదేశాల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. అయితే, భారత్​-పాక్ దేశాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు వీరి బంధానికి ఎప్పుడూ అడ్డురాలేదు. తాజాగా, సానియాతో తన వివాహం గురించి స్పందించాడు షోయబ్​. హైదరాబాద్​కు చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకునే ముందు తాను ఏమాత్రం భయపడలేదని తెలిపాడు.

"వివాహ సమయంలో మీ భాగస్వామి ఎక్కడ నుంచి వచ్చారు? లేదా ఇరు దేశాల్లో ఏం జరుగుతుందనే అనవసర విషయాల గురించి ఆందోళన చెందరు. మీరు ఒకరిని ప్రేమించి.. ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటే ఇవన్నీ పట్టించుకోకూడదు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. నాకు భారత్​లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధం విషయంలో నేను ఎప్పుడూ బాధపడను. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడ్ని కాదు.. ఒక క్రికెటర్​ని."

-షోయబ్​ మాలిక్​, పాక్​ క్రికెటర్​

ఇండో-పాక్​ ద్వైపాక్షిక క్రికెట్​ సిరీస్​లపై స్పందించాడు మాలిక్. ప్రపంచ క్రికెట్​కు ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్​ల మధ్య జరిగే యాషెస్ సిరీస్​ ఎంత ముఖ్యమో.. భారత్​- పాక్​ దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్​లు కూడా అంతే ముఖ్యమని తెలిపాడు. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్​ల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని.. అందులో తానూ ఒకడినని చెప్పాడు. త్వరలోనే ఇరుదేశాల మధ్య సిరీస్ ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.

2015లో మాలిక్​ టెస్టు క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు. ఇంగ్లాండ్​లో జరిగిన ప్రపంచ కప్​ తర్వాత గతేడాది 50 ఓవర్ల ఫార్మాట్​కు వీడ్కోలు చెప్పాడు. అయితే, టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు

ఇదీ చూడండి:సానియాను కలిసేందుకు షోయబ్​కు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.