ETV Bharat / sports

'కెప్టెన్​గా పంత్​ ఆట వేరే స్థాయిలో ఉంటుంది'

author img

By

Published : Apr 3, 2021, 8:44 AM IST

IPL 2021: Captaincy will take Pant's game to another level, says Kaif
'కెప్టెన్​గా పంత్​ ఆట వేరే స్థాయిలో ఉంటుంది'

దిల్లీ క్యాపిటల్స్​(డీసీ) కొత్త కెప్టెన్​ రిషభ్ పంత్​ను మాజీ క్రికెటర్, డీసీ సహాయక కోచ్​ మహమ్మద్​ కైఫ్ ప్రశంసించాడు. సారథిగా పంత్​ ఆట వేరే స్థాయికి వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గాయం కారణంగా లీగ్​కు దూరమైన శ్రేయస్​ అయ్యర్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ​

దిల్లీ క్యాపిటల్స్(డీసీ)​ కెప్టెన్​గా ఎంపికైన తర్వాత రిషభ్ పంత్​ను ప్రశంసించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మాజీ క్రికెటర్​, డీసీ సహాయక కోచ్ మహమ్మద్ కైఫ్..​ పంత్​ను కొనియాడాడు. సారథిగా రిషభ్​ ఆట వేరే స్థాయిలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దిల్లీ పూర్తి స్థాయి కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ త్వరగా కోలుకోవాలని కైఫ్​ ఆకాంక్షించాడు.

ఇదీ చదవండి: 'నేను చూసిన యువ క్రికెటర్లలో పంత్​ ఉత్తమం'

"గాయం కారణంగా జట్టుకు దూరమైన శ్రేయస్​ అయ్యర్​ త్వరగా కోలుకోవాలి. దిల్లీ నూతన కెప్టెన్​ రిషభ్ పంత్​కు ఆల్​ ది బెస్ట్​. కెప్టెన్​గా అతని ఆట మరో స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నా" అని కైఫ్​ ట్వీట్​ చేశాడు.

  • Wishing a speedy recovery to @ShreyasIyer15 who captained us in our dream run to the IPL final. All the best to our dilli ka kadak launda, @RishabhPant17. I'm sure captaincy will take his game to yet another level.

    — Mohammad Kaif (@MohammadKaif) April 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా దిల్లీ తమ తొలి మ్యాచ్​ను ఏప్రిల్​ 10న చెన్నై సూపర్​ కింగ్స్​తో ఆడనుంది.

ఇదీ చదవండి: 'దిల్లీ క్యాపిటల్స్​కు ఈసారీ అతడే ఎక్స్‌-ఫ్యాక్టర్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.