ETV Bharat / sports

'దారంతా గతుకులు.. కానీ విజయం​ మాదే'

author img

By

Published : Aug 22, 2020, 9:55 AM IST

ఐపీఎల్​ టైటిల్​ గెలిచే దారిలో ఎన్ని అడ్డంకులున్నా.. విజయాన్ని సాధిస్తామని అన్నాడు కోల్​కతా నైట్​రైడర్స్​ కెప్టెన్​ దినేశ్​ కార్తిక్​. సెప్టెంబరు 19న లీగ్​ మొదలవనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

Dinesh Karthik
దినేశ్​ కార్తిక్​

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్​ 13వ సీజన్​ ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరిగే ఈ లీగ్​ టైటిల్​ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తాజాగా కోల్​కతా నైట్​రైడర్స్​ కెప్టెన్​ దినేశ్​ కార్తిక్​ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఐపీఎల్​కు ముందు శిక్షణ లేకపోవడం పెద్ద సమస్యని అన్నాడు. కానీ, తమ అభిమానులు గర్వించేలా ఆడతామని పేర్కొన్నాడు.

"ఈసారి ఐపీఎల్​ భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు మమ్మల్ని తీవ్ర బాధకు గురిచేశాయి. ఇలాంటప్పుడు క్రికెట్​ పెద్ద సవాలు. అయితే, మా అభిమానుల ఆనందం కోసం కచ్చితంగా ఆడి తీరతాం. బయో బబుల్​ వాతావరణంలో మేము క్రికెట్​ ఆడాల్సి ఉంటుంది. కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాం. శిక్షణ లేదు. ముందుకు వెళ్లే దారిలో అడ్డంకులు ఎన్నైనా ఉండొచ్చు.. కానీ, విజయాన్ని సాధించి తీరతాం."

-దినేశ్ కార్తిక్​, కేకేఆర్​ కెప్టెన్​

స్టేడియంలో తమకు మద్దతుగా నిలిచే అభిమానుల సందడిని కోల్పోతున్నందుకు బాధగా ఉందని వెల్లడించాడు కార్తిక్. అయితే, ప్రతి అభిమాని తమకోసం వారి హృదయాల్లో ఎనలేని ప్రేమను నింపుకుని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నాడు.

ఇప్పటికే రాజస్థాన్​ రాయల్స్​, కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్​ ఆటగాళ్లు దుబాయ్​ చేరుకోగా.. కేకేఆర్​ అబుదాబిలో అడుగుపెట్టింది. ​చెన్నై సూపర్​ కింగ్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, ముంబయి ఇండియన్స్​ జట్లు శుక్రవారం యూఏఈకి చేరుకున్నాయి. దిల్లీ క్యాపిటల్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఆటగాళ్లు ఈ వారాంతంలో ఐపీఎల్ ఆతిథ్య దేశానికి వెళ్లనున్నారు. సెప్టెంబరు 19న లీగ్​ ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.