ETV Bharat / sports

వీక్షణలో మహిళా టీ20 ప్రపంచకప్​ ఫైనల్ రికార్డుల మోత​

author img

By

Published : Apr 2, 2020, 6:12 PM IST

ఈ మధ్యే జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ సహా ఫైనల్​ మ్యాచ్​​ వీక్షణలో పలు సరికొత్త రికార్డులు నెలకొల్పింది. భారత్​లోనే కాకుండా ఆస్ట్రేలియా టీవీ చరిత్రలో పలు ఘనతలు నమోదు చేసింది.

ICC Womens World T20
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/02-April-2020/6635420_ind.jpg

గత నెలలో జరిగిన మహిళా టీ20 ప్రపంచకప్​లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. మార్చి 8న తుదిపోరులో టీమిండియా.. కంగారూ జట్టు చేతిలో 85 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే వీక్షణలో ఈ మ్యాచ్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ పోరును భారత్​లో టీవీ, డిజిటల్​ మాధ్యమాల ద్వారా సుమారు 9.02 మిలియన్ల​ మంది వీక్షించారని ఐసీసీ గురవారం వెల్లడించింది. నిమిషాల వ్యవధిలో ఈ టోర్నీని, భారత్​లో 5.4 బిలియన్ల మంది చూసినట్లు ​ఐసీసీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే 2019 పురుషుల ప్రపంచకప్​ తర్వాత ఇదే అత్యుత్తమం.

గతంతో పోలిస్తే పదుల రెట్లు ఎక్కువగా

ఈ మహిళా ప్రపంచకప్​ వీక్షణలు, 2018 వెస్టిండీస్​లో జరిగిన ఇదే టోర్నీ​తో పోలిస్తే.. 20 రెట్లు అధికంగా ఉన్నాయి. 2017 ఐసీసీ మహిళా ప్రపంచకప్​ కంటే 10 రెట్లు అధికంగా దీనిని వీక్షించారు. హాట్​స్టార్​ ద్వారా భారత్​లో సుమారు 3.1 మిలియన్​ల మంది ఫైనల్ మ్యాచ్​ చూశారు.

టీ20 ప్రపంచకప్​లో తొలిసారి ఫైనల్​ చేరిన హర్మన్​సేన ఆటను దాదాపు 1.78 బిలియన్ల నిమిషాల పాటు వీక్షించారు. ఇది 2018లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్​ మధ్య జరిగిన తుదిపోరు కంటే 59 రెట్లు అధికం.

ICC Womens World T20
'ఉమెన్ ఇన్​ బ్లూ' టీమ్​

ఆసీస్​ బ్రాడ్​కాస్ట్​ చరిత్రలో

ఫైనల్​ను ఆస్ట్రేలియాలో సుమారు 1.2 మిలియన్ల మంది చూశారు. ఆ దేశంలో అత్యధికులు వీక్షించిన క్రికెట్ మ్యాచ్ ఇదే​ కావడం విశేషం. మొత్తంగా చూసుకుంటే అక్కడి బ్రాడ్​కాస్ట్​ చరిత్రలో ఆరో అత్యధికం.

ప్రత్యక్ష హాజరులోనూ ఈ పోరు రికార్డు సృష్టించింది. మెల్​బోర్న్​ క్రికెట్​ మైదానం​లో జరిగిన ఈ మ్యాచ్​కు 86,174 మంది హాజరయ్యారు.

ICC Womens World T20
విజయానంతరం ఆస్ట్రేలియా మహిళల జట్టు

ఇదీ చదవండి: 'వారితో పోల్చుకుంటే ఐదారేళ్లు వెనకే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.